వీళ్లిద్దరు మళ్లీ కలిశారు?

Tuesday,April 28,2020 - 12:18 by Z_CLU

తెలుగుతెరపై హిట్ కాంబినేషన్లకు ఉండే క్రేజే వేరు. హిట్ కాంబినేషన్ మరోసారి కలిస్తే సినిమాకు ఆటోమేటిగ్గా క్రేజ్ వస్తుంది. మార్కెట్ పెరుగుతుంది. అందుకే మేకర్స్ కు అలాంటి కాంబినేషన్లు అంటే పిచ్చి. మరీ క్రేజీ కాకపోయినా, ఓ హిట్ కాంబినేషన్ మరోసారి కలవబోతోంది. వాళ్లే రాజ్ తరణ్, అవికాగౌర్.


వీళ్లిద్దరికీ హిట్ కాంబినేషన్ అనే సంగతి అందరికీ తెలిసిందే. ఉయ్యాల జంపాల సినిమాతో పరిచయమైన వీళ్లిద్దరూ, ఆ సినిమాతో హిట్ కొట్టారు. ఆ తర్వాత సినిమా చూపిస్త మామ సినిమాతో ఇద్దరూ కలిసి మరో హిట్ కొట్టారు. ఇప్పుడు హ్యాట్రిక్ మూవీకి సిద్ధమౌతోంది ఈ జంట.


డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఓ లవ్ స్టోరీ రాసుకున్నాడు దర్శకుడు శ్రీనివాస్ గవిరెడ్డి. తన సినిమాలో రాజ్ తరుణ్, అవికా గౌర్ ను పెయిర్ గా చూపించాలని ఫిక్స్ అయ్యారు. రాజ్ తరుణ్ దాదాపు 2 నెలల కిందటే ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

తాజాగా అవికా గౌర్ కూడా ఓకే చెప్పిండి. అలా ఉయ్యాల జంపాల జోడి మరోసారి కలిసింది. ఈసారి వీళ్లిద్దరు కలిసి హ్యాట్రిక్ కొడతారేమో చూడాలి.