అంధగాడు ఫస్ట్ సింగిల్ ఇవాళే రిలీజ్

Tuesday,May 09,2017 - 12:30 by Z_CLU

రాజ్ తరుణ్ అంధగాడు ఈ రోజు సాయంత్రం 5 గంటల నుండి సోషల్ మీడియాలో స్పెషల్ ప్లేస్ ని ఆక్యుపై చేసుకోనుంది. హెబ్బా పటేల్ జంటగా నటించిన ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ‘దెబ్బకు పోయే పోయే’ సాంగ్ ని రిలీజ్ చేయనుంది సినిమా యూనిట్. మే 26 నుండి థియేటర్స్ లో హంగామా చేయనున్న ఈ సినిమాకి శేఖర్ చంద్ర మ్యూజిక్ కంపోజ్ చేశాడు.

ఇప్పటికే ఎట్రాక్టివ్ టీజర్ తో క్రేజ్ ని క్రియేట్ చేసుకున్న ఈ అంధగాడు, సినిమా రిలీజయ్యే లోపు మ్యూజిక్ తో మ్యాగ్జిమం కాన్సంట్రేషన్ తిప్పుకునే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది. వెలిగొండ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా AK ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కింది. క్రేజీ ఆన్ స్క్రీన్ పెయిర్ అనిపించుకున్న రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ ఈ సినిమాకి పెద్ద ఎసెట్ అనిపించుకునే చాన్సెస్ అయితే బోలెడు కనిపిస్తున్నాయి.