రాజ్ కందుకూరి ఇంటర్వ్యూ

Thursday,November 23,2017 - 05:31 by Z_CLU

‘పెళ్ళి చూపులు’ గ్రాండ్ సక్సెస్ తరవాత రాజ్ కందుకూరి నిర్మించిన ‘మెంటల్ మదిలో’ సినిమా రేపు గ్రాండ్ గా రిలీజ్ కానుంది. శ్రీవిష్ణు, నివేత పేతురాజ్ జంటగా నటించిన ఈ సినిమా టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది. ఈ సందర్భంగా ఈ మూవీ ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి ఈ సినిమా బిగిన్ అయిన దగ్గరి నుండి రిలీజ్ వరకు చేసిన జర్నీ లోని ఇంట్రెస్టింగ్ ఎక్స్ పీరియన్సెస్ షేర్ చేసుకున్నాడు. అవి మీకోసం…

వారం రోజుల్లో తయారైన కథ ఇదీ….

వివేక్ ఆత్రేయ బిగినింగ్ లో నాకొక కథ చెప్పాడు. అది చాలా బావుంది కానీ కమర్షియల్ గా వర్కవుట్ కాదని, ఇంకో కథతో రమ్మని చెప్పాను. వారం రోజుల్లో ఈ కథ రెడీ చేసుకుని వచ్చాడు… వినగానే నచ్చేసింది.

 

 

సినిమా చేయడానికి రీజన్ అదే…

ఈ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ ఎంత బావుంటుందంటే .. ఇక ఈ సినిమాలో నవ్వించడానికి సినిమాలో కామెడీ స్పెషల్ గా క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం రాలేదు. జెనెరల్ గా కన్ఫ్యూజన్ అనేది కాఫీ లేదా టే మధ్య క్రియేట్ అవ్వచ్చు, మనం వేసుకునే షర్ట్ మధ్య క్రియేట్ అవ్వచ్చు, కానీ లైఫ్ లో తీసుకునే ఇంపార్టెంట్ డెసిషన్స్ మధ్య క్రియేట్ అయితే లైఫ్ ఎలా ఉంటుంది అనేదే ఈ సినిమా కాన్సెప్ట్…

శివాజీ రాజా హైలెట్ సినిమాకి…

సెకండాఫ్ లో క్రియేట్ అయ్యే కాంఫ్లిక్ట్ కి ఫాదర్ రోల్ ద్వారా సొల్యూషన్ ఇచ్చాం… ఈ క్యారెక్టర్ లో శివాజీ రాజా నటించాడు. సినిమా చూసిన వాళ్ళందరూ ఆయన్ని చాలా అప్రీషియేట్ చేస్తున్నారు…

హీరో విష్ణు అద్భుతంగా చేశాడు…

విష్ణు చాలా సైలెంట్ గా రిజర్వ్డ్ గా ఉంటాడు. ఈ సినిమాలో తన నేచర్ కి, బాడీ లాంగ్వేజ్ కి తగ్గ రోల్ ప్లే చేశాడు.

 

 

అందుకే చిన్న సినిమాలు చేస్తున్నా…

‘పెళ్లిచూపులు’ సినిమా తరవాత  అందరూ పెద్ద సినిమా చేస్తాననుకున్నారు. పెద్ద సినిమా చేయడం ఇష్టమే కానీ, మంచి సినిమాలు చేయడం వల్ల ఎంతో తృప్తిగా ఉంది.

ఇది మాత్రం గ్యారంటీ….

రాజ్ కందుకూరి సినిమా అంటే కంపల్సరీగా కుటుంబ సమేతంగా చూడదగ్గ మంచి సినిమా అనిపించుకోవాలి. అదే నా టార్గెట్. ఈ సినిమా రిలీజ్ తరవాత అందరికీ ఆ నమ్మకం వస్తుందని నా ఫీలింగ్….

ఆ రోజు సినిమాలు చేయడం మానేస్తా…

కంపల్సరీగా ఫార్ములా సినిమాలే చేయాలి, తెలిసిన ఫేసులతోనే సినిమాలే చేయాలి, అలాంటి సినిమాలకే మార్కెట్ ఉంటుంది అనిపించిన రోజు నేను సినిమాలు మానేస్తాను…

అప్పుడే సినిమాలు ఆడతాయి…

మనం 100 రూపాయలు పెట్టి సినిమా చూసినప్పుడు ఎన్ని యూనిట్ల స్యాటిస్ ఫ్యాక్షన్ తో ఇంటికి వెళ్తున్నాం అన్నదే ఇంపార్టెంట్. ప్రేక్షకుడు పెట్టిన డబ్బులకు న్యాయం చేసినప్పుడే సినిమాలు ఆడతాయి.