రాహుల్ విజయ్ ఇంటర్వ్యూ

Wednesday,March 27,2019 - 05:10 by Z_CLU

‘సూర్యకాంతం’ సినిమాలో కొన్ని ఇన్నోసెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించాడు రాహుల్ విజయ్. మొదటి సినిమా అంతగా సక్సెస్ అవ్వకపోయినా, నా ట్యాలెంట్ ని నమ్ముకున్నాను కాబట్టే సూర్యకాంతం లో అవకాశం వచ్చింది అని చెప్పుకున్న, ఈ సినిమాకి సంబంధించి జరిగిన మీడియా ఇంటరాక్షన్ లో మరిన్ని విషయాలో షేర్ చేసుకున్నాడు… అవి మీకోసం..

అలా జరిగింది…

ప్రణీత్ ఈ రోల్ కోసం చాలా మందిని చూశాడట కానీ కుదరలేదు. అప్పుడు వరుణ్ తేజ్ గారు నేను ఒకసారి కలిసినప్పుడు ప్రణీత్ కి రిఫర్ చేశారట. అప్పుడు ప్రణీత్ గారు ఒకరోజు ఆడిషన్ చేసి, ఇంకోరోజు నిహారికతో ఫోటో షూట్ చేశారు. ఆ తరవాత ఓకె అన్నారు…

నేనైతే అదే నమ్ముతా…

నా ఫస్ట్ సినిమా ఆడకపోయినా నాకైతే మంచి పేరు వచ్చింది. నా వరకు నేను బాగా పర్ఫామ్ చేశాననే ఫీడ్ బ్యాక్, దానికి తోడు ఆ సినిమా రిలీజ్ కి ముందే ‘సూర్యకాంతం’ ఆఫర్ వచ్చిందంటే, నా ట్యాలెంట్ వల్లే అని, నన్ను నేను నమ్ముకున్నాను.

ఒక్కో కథ…

సినిమాలో ప్రతి క్యారెక్టర్ కి ఒక కథ ఉంటుంది. కాంతం కి ఒక కథ… అభికి ఓ కథ… పూజ కి ఓ కథ.. రేపు సినిమా చూస్తున్నవాళ్ళు ఎవరైనా ఎవరితోనైనా ట్రావెల్ అవ్వచ్చు… అల్టిమేట్ గా సినిమా చూశాక ఇలాంటి రిలేషన్ షిప్స్  కూడా ఉంటాయా అనిపిస్తుంది…

సినిమాలో హ్యూమర్ పాయింట్…

సినిమాలో హీరో పడే ఇబ్బందులు, ఫేస్ చేసే సిచ్యువేషన్స్ వల్ల కామెడీ జెనెరేట్ అవుతుంది. కంప్లీట్ సినిమా అభి పాయింట్ ఆఫ్ వ్యూ లో మూవ్ అవుతుంది.

అందుకే సిద్ శ్రీరామ్

సినిమాలో చాలా ఇంపార్టెంట్ సాంగ్ పాడాడు సిద్ శ్రీరామ్. అభి, పూజకి మధ్య రిలేషన్ సరిగ్గా ఎస్టాబ్లిష్ అయితేనే సెకండాఫ్ లో వచ్చే ఎమోషన్ సీన్స్ కనెక్ట్ అవుతాయి. అందుకే ఆ సాంగ్ సిద్ శ్రీరామ్ పాడితేనే ఆ ఇంపాక్ట్ ఉంటుందని, సిద్ శ్రీరామ్ చేత పాడించారు.

కాంతం కంత్రీఫెలో…

నిహారిక ప్లే చేసిన కాంతం రోల్ పెద్ద కంత్రీఫెలో… ఒక రకంగా ఈ క్యారెక్టర్ కొంచెం తక్కిన క్యారెక్టర్స్ ని డామినేట్ చేసే క్యారెక్టర్. అయినా ప్రణీత్ ఈ 3 క్యారెక్టర్స్ ని ఎక్కడా తక్కువ కాకుండా, ఎక్కువ కాకుండా అందంగా బ్యాలన్స్ చేశాడు.

నెక్స్ట్ సినిమా…

ఒక తమిళ, తెలుగు బైలింగ్వల్ చేయబోతున్నాను. కన్నడలో బ్లాక్ బస్టర్ అయిన ‘కాలేజ్ కుమార’ కి రీమేక్ ఇది. ఈ సినిమాలో తెలుగు వర్షన్ లో నాకు ఫాదర్ గా శ్రీకాంత్ గారు, తమిళంలో ప్రభు గారు చేస్తున్నారు. ఏప్రియల్ థర్డ్ వీక్ నుండి ఈ సినిమా సెట్స్ పైకి వస్తుంది.

ఇంకో సినిమా…

ఇంకో సినిమా క్రిప్ట్ ఓకె అయింది. కిక్ బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ బేస్డ్ ఎంటర్టైనర్ అదీ.. ఇంకా ప్రొడ్యూసర్ ఫైనల్ అవ్వలేదు. చాలా మంచి సినిమా అవుతుంది అది కూడా.

నాన్న ఇన్వాల్వ్ మెంట్…

నాన్న నా కరియర్ లో ఎప్పుడూ ఇన్వాల్వ్ అవ్వలేదు. నేను యాక్టర్ ని అవుతాను అనుకున్నప్పుడు కూడా యస్ అన్నారు, నా ఇంట్రెస్ట్ ప్రకారమే నేను మార్షల్ ఆర్ట్స్, కిక్ బాక్సింగ్ నేర్చుకున్నాను. ఇప్పటికైనా స్క్రిప్ట్ విన్నప్పుడు ఏమైనా అనిపించింది చెప్తారు కానీ, నిర్ణయం మాత్రం నాదే అంటారు…