'రాహుల్ విజయ్' ఎక్స్ క్లుజీవ్ ఇంటర్వ్యూ

Wednesday,September 19,2018 - 03:30 by Z_CLU

నిర్మాతల కొడుకులు, దర్శకుల కొడుకులు హీరోలు అవ్వడం మాములే.. కానీ  ఓ ఫైట్ మాస్టర్ కొడుకు హీరో అయితే… ఎన్నో ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఫైట్ మాస్టర్ గా పనిచేస్తున్న విజయ్ మాస్టర్ కొడుకు రాహుల్ విజయ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. రాహుల్ హీరోగా నటించిన మొదటి సినిమా ‘ఈ మాయ పేరేమిటో’ ఈ నెల 21 న విడుదలవుతోంది. ఈ సందర్భంగా రాహుల్ విజయ్ ‘జీ సినిమాలు’ తో ఎక్స్ క్లూజీవ్ గా మాట్లాడాడు. ఆ విశేషాలు రాహుల్ మాటల్లోనే..

 

ఫిక్సయి వచ్చా…

ఈ సినిమా చేయాలి అని ఫిక్సవ్వకముందే అసలు జనం నన్నెందుకు చూడాలి అనేది ఫిక్సయి వచ్చా… మనల్ని మనం ఒక డిఫెరెంట్ ఫార్మాట్ లో ప్రెజెంట్ చేసుకోవాలి. సీనియర్స్ తో డిస్కస్ చేయడం వల్ల సినిమా కరియర్ పై క్లారిటీ వచ్చింది.

 

ఒక రకంగా పిచ్చి…

నాకు రజినీకాంత్ గారన్నా, మెగాస్టార్ అన్నా చాలా ఇష్టం. వాళ్ళ సినిమాలు చూస్తూ థియేటర్స్ లో డ్యాన్స్ చేసేవాణ్ణి… నన్ను నేను కూడా అలా చూసుకోవాలి అనుకునే వాణ్ణి.. ఒక రకంగా వాళ్ళిద్దరూ అంటే నాకు పిచ్చి.

 

షాక్ అయ్యా…

నాని గారైతే నా సినిమాలో క్యారెక్టర్ కూడా చేస్తానన్నారు. నాని అన్న ఆ మాట అనగానే షాక్ అయ్యా. ఫైనల్ గా మా సినిమాకు ఆయన వాయిస్ ఓవర్ ఇచ్చారు. చాలా హ్యాపీ.

 

సుకుమార్ గారికి నచ్చింది

స్టోరీ విని సుకుమార్ గారు కూడా చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. అప్పుడే నాకింకా కాన్ఫిడెన్స్ వచ్చింది. దర్శకుడిగా ఆయనకీ సబ్జెక్ట్ మీద చాలా నాలెడ్జ్ ఉంటుంది.

నాన్న చెప్పింది అదే

హీరో కాకముందు నాన్నగారు నాకు ఒకే మాట చెప్పారు. నువ్వు 24 క్రాఫ్ట్స్ ని స్యాటిస్ ఫై చేయగలవు అనుకుంటేనే నువ్వీ ఫీల్డ్ లో ఉండు. లేకపోతే మానేయ్ అన్నారు. ఇపుడు మా డైరెక్టర్ నా విషయంలో చాలా హ్యాప్పీ అని చెప్తుంటే, నాన్న మాట కొంత వరకూ నిలబెట్టుకున్నా అనిపించింది.

 

కలిసొచ్చింది.

ఇండస్ట్రీలో నాన్నగారికి ఉన్న గుడ్ విల్ ఈ సినిమాకి కలిసొచ్చింది. అందుకే నా సినిమాకి ఇంత సపోర్ట్ దొరికింది. తారక్ అన్న, పూరి గారు, వినాయక్ గారు, సుకుమార్ గారు, నాని అన్న ఇలా చాలా మంది నా సినిమాను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేసారు. నిజంగా ఇది నా అదృష్టం గా భావిస్తున్నా.

 

పూరి జగన్నాథ్ గారితో…

పూరి జగన్నాథ్ గారితో కాసేపు స్పెండ్ చేస్తే చార్జింగ్ పెట్టుకున్నట్టే… లైఫ్ లో ఎప్పుడు లో గా ఫీలైనా, ఆయనతో కాసేపు మాట్లాడితే చాలు, ఏదైనా చేసేయొచ్చు అనిపించేస్తుంది. ఫుల్ కాన్ఫిడెన్స్ ఇస్తారు. ఈ సినిమాను స్టార్టింగ్ నుండి ఎంతో సపోర్ట్ చేస్తూ వచ్చారు.

 

శ్రీహరి గారితో అనుబంధం …

శ్రీహరి గారంటే నాకు పెదనాన్న లాగే… సంవత్సరంలో 8 నెలలు మా ఇంట్లో ఉంటే, 4 నెలలు వాళ్ళింట్లోనే ఉండేవాడిని. అంత క్లోజ్ అయన మాకు. ఆయనింట్లో ఎపుడూ 50 నుండి 100 మంది తినేవాళ్ళు.. ముఖ్యంగా శాంతి ఆంటీ మా పిల్లలందరికీ ముద్దలు కలిపి తినిపించే వారు. ఇప్పుడు శ్రీహరి గారుంటే బాగుండేది.

 

అలా జరిగింది..

అక్క దివ్య విజయ్ మైత్రి మూవీ మేకర్స్ లో చేస్తుంది. తనకు ప్రొడక్షన్ హౌజ్ ప్లాన్ ఉన్నాయి కానీ ఇంకొంచెం టైమ్ తీసుకుందామనుకుంది. 2020 లో చేద్దాము అనే ప్లాన్ లో ఉంది. అంతలో ఈ ప్రాజెక్ట్ డిలే అవుతుండే సరికి, తనే ఇన్వాల్వ్ అయి సినిమాని మన బ్యానర్ లో చేసేద్దాం అంటూ సెట్స్ పైకి తీసుకువచ్చింది.

 

నో అడల్ట్ కంటెంట్

సినిమాలో అడల్ట్ కంటెంట్ పెద్దగా ఉండదు. ఇమోషన్ కి తగ్గటు రిక్వైర్ మెంట్ ఉన్నప్పుడే కొన్ని సీన్స్ ఉంటాయి తప్ప, అడల్ట్ మూవీ చేయాలని చేసిన సినిమా కాదిది. ఒక్కో ఇమోషన్ ని సందర్భానుసారంగా, ఒక్కోలా ఎక్స్ ప్రెస్ చేస్తాం.. ఈ సినిమాలో కూడా అలాగే ఉంటుంది తప్ప, కావాలని చేసిన ఒక్క సీన్ సినిమాలో ఉండదు.

 

నమ్మలేకపోయా…

నా సినిమాకి మణిశర్మ గారు సాంగ్ చేయడమంటేనే చాలా పెద్ద విషయం. అలాంటిది ఆయన ఒక ట్యూన్ పంపించి, నచ్చిందా లేదా లేకపోతే ఇంకొకటి పంపమంటారా అంటే ఏం చెప్తాం… అసలు నా సినిమాకి ఆయన మ్యూజిక్ కంపోజ్ చేశారన్నది నమ్మడానికే నాకు చాలా టైమ్ పట్టింది..

అది మాత్రం పక్కా

ఈ సినిమా కూడా రెగ్యులర్ తెలుగు సినిమా ఫార్మాట్ లో అస్సలుండదు. సినిమా అయిపోయాక కూడా ఈ సినిమా లోని ఇమోషన్ మనతో పాటు క్యారీ అవుతుంది అది మాత్రం ష్యూర్.

 

కథలు వింటున్నా

ప్రస్తుతం ప్రనీత్ అనే దర్శకుడితో నిహారికతో కలిసి ఓ సినిమా చేస్తున్నా.. దానికి ఇంకా టైటిల్ పెట్టలేదు. 70 షూట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇయర్ బిగినింగ్ లో రిలీజ్ అవుతుంది. ఇంకా కొన్ని కథలు వింటున్నా.