చైతూ ని డైరెక్ట్ చేయబోతున్న యంగ్ హీరో ?

Sunday,July 08,2018 - 02:20 by Z_CLU

చందూ మొండేటి డైరెక్షన్ లో ‘సవ్యసాచి’ సినిమాతో పాటు మారుతితో ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమా చేస్తున్నాడు నాగ చైతన్య… ప్రస్తుతం ఈ రెండు సినిమాలతో బిజీ గా ఉన్న చైతూ త్వరలోనే శివ నిర్వాన డైరెక్షన్ లో సమంతతో కలిసి ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమా తర్వాత చైతూ హీరో రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నడనే వార్త చక్కర్లు కొడుతుంది. మొన్నటి వరకూ హీరోగా వరుస సినిమాలు చేసిన రాహుల్ ఇటివలే సుశాంత్ హీరోగా తెరకెక్కిన ‘చిలసౌ’ సినిమాతో మెగా ఫోన్ పట్టుకున్నాడు.

ఇటివలే ‘చిలసౌ’ సినిమాను చూసిన నాగార్జున రాహుల్ డైరెక్షన్ కి ఫిదా అయిపోయాడట.. అందుకే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ తీసుకొని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నాడు. అంతే కాదు ఈ సినిమా తర్వాత చైతూ కోసం ఓ కథ రెడీ చేయమని రాహుల్ కి చెప్పాడట నాగ్. సో త్వరలోనే ఈ యంగ్ హీరో చైతూను డైరెక్ట్ చేసే చాన్స్ ఉంది.