'రాహుల్ రవీంద్రన్' ఎక్స్ క్లూజీవ్ ఇంటర్వ్యూ

Thursday,August 08,2019 - 06:26 by Z_CLU

‘చిలసౌ’సినిమాతో యాక్టర్ నుండి డైరెక్టర్ గా మారిన రాహుల్ రవీంద్రన్ రెండో సినిమాతో ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయ్యాడు. రాహుల్  డైరెక్ట్ చేసిన రెండో సినిమా మన్మథుడు 2 రేపే థియేటర్స్ లోకి రాబోతుంది. ఈ సందర్భంగా రాహుల్ ‘జీ సినిమాలు’ తో ఎక్స్ క్లూజీవ్ గా మాట్లాడాడు. ఆ విశేషాలు తన మాటల్లోనే…

అస్సలు ఊహించలేదు

రెండో సినిమాకే నాగార్జున గారిని డైరెక్ట్ చేస్తానని ఇంత పెద్ద సినిమా దొరుకుంటుందని అస్సలు ఊహించలేదు. ఇది ఫుల్లెంగ్త్ కామెడీ ఫిలిం. అందరూ కలిసి సరదాగా నవ్వుతూ చూసే సినిమా.  నాగార్జున గారు ‘చిలసౌ’ సినిమా చూసి వీడి సెన్సార్ హ్యుమర్ బాగుందని భావించి ఈ సినిమాకు అవకాశం ఇచ్చారని భావిస్తున్నాను.


మళ్ళీ ‘మన్మథుడు’గా

నాగార్జున గారి క్యారెక్టర్ కి రేపు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఆయన చెప్పే డైలాగ్స్ బాగా పేలతాయి. కచ్చితంగా ఆయన మళ్ళీ మన్మథుడిగా ఎంటర్టైన్ చేస్తారు. ఫ్యామిలీ మొత్తం కలిసి చూడాల్సిన సినిమా ఇది. ఎక్కడా వల్గర్ అనిపించేలా ఉండదు.

‘చిలసౌ’ మెమోరబుల్ ఫిలిం

చిలసౌ నాకు ఓ మెమొరబుల్ ఫిలిం. థియేటర్స్ లో ఆడుతున్నప్పటి కంటే ఇప్పుడు ఇంకా  బెటర్ ఫీడ్ బ్యాక్ వస్తుంది. ఈ మధ్య హిందీ ప్రీమియర్ పడినప్పుడు ఆ రెస్పాన్స్ చూసి యూట్యూబ్ లో కామెంట్స్ చూసి చాలా హ్యాపీ గా ఫీలయ్యాను. మొదటి సినిమా అందరికీ కనెక్ట్ అయి ఇలాంటి రెస్పాన్స్ వస్తున్నందుకు దర్శకుడిగా సాటిస్ఫాక్షన్ పొందాను. ఒక సినిమా తీశాం, రిలీజ్ అయి ఇయర్ అయిపొయింది. ఇప్పటికీ ఆ సినిమా గురించి మాట్లాడుతుంటే అంతకంటే ఏం కావాలి.

కంప్లీట్ రీమేక్ కాదు

నాగార్జున గారు పిలిచి ఈ సినిమా చేయాలని చెప్పినప్పుడు రైట్స్ ఉన్నాయా సార్ అని అడిగాను. దానికి రీజన్ నాకు ఫ్రీ మేక్ చేయడం నచ్చదు. నాగార్జున గారు కూడా అలాగే ఫీలవుతారు అందుకే ప్రాపర్ రైట్స్ తీసుకున్నాకే నన్ను పిలిచారు. ఇది కంప్లీట్ రీమేక్ కాదు. ఆ సినిమాలో కథ మాత్రమే తీసుకొని చాలా మార్పులు చేసి స్క్రీన్ ప్లే మొత్తం మళ్ళీ ఫ్రెష్ గా రాసుకొని  ఓ పూర్తి వినోదాత్మక సినిమాగా మలిచాం.

అవంతికగా గుర్తుండిపోతుంది

రకుల్ తన డెబ్యూ సినిమా కంటే ముందే నాకు తెలుసు. నాకొక చెల్లి ఉంటే అలాగే ఉంటుందని ఫీలవుతుంటాను. తను కూడా నన్ను భయ్యా అని పిలిస్తుంది. సినిమాలో అవంతిక క్యారెక్టర్ లో బెస్ట్ అనిపించుకుంది. రేపు సినిమా చూసాక అందరికీ రకుల్ అవంతికగా గుర్తుండిపోతుంది. ఆ క్యారెక్టర్ కి తను  పర్ఫెక్ట్ . రకుల్ తో మళ్ళీ సినిమా చేయాలనుంది.

లక్ష్మీ గారే కావాలని

ఈ కథ రాసాక కచ్చితంగా ఈ రోల్ కి లక్ష్మీ గారే కావాలని చెప్పాను. అందరూ కూడా ఆవిడే పర్ఫెక్ట్ అని భావించారు. లక్ష్మీ ని డైరెక్ట్ చేయడం ఆవిడతో పనిచేయడం చాలా సంతోషాన్నిచ్చింది. కొన్ని సన్నివేశాల్లో ఆమె నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. అలాగే రావు రమేష్ గారి క్యారెక్టర్ కూడా అందరికీ నచ్చేలా ఉంటుంది. ఆ క్యారెక్టర్ లో చిన్న సస్పెన్స్ ఉంది. అదేంటనేది రేపు తెలుస్తుంది.

ఈసారి ఫుల్లెంగ్త్ రోల్

వెన్నెల కిషోర్ ని చిలసౌ లో జస్ట్ కొన్ని సీన్స్ లో మాత్రమే వాడుకున్నాను. ఈ సినిమాలో తనది ఫుల్లెంగ్త్ రోల్. కంప్లీట్ గా ఎంటర్టైన్ చేస్తాడు. ఈ సినిమాలో కూడా తన కామెడీ హైలైట్ అవుతుంది. పడి పడి నవ్వుతారు.

అక్కినేని హీరోలందరితో చేయాలనుంది

సుశాంత్ తో నా ఫస్ట్ ఫిలిం చేసాను. ఇప్పుడు నాగ్ సార్ ని డైరెక్ట్ చేసాను. బ్యాక్ టు బ్యాక్ అక్కినేని హీరోలతో సినిమాలు చేయడం హ్యాపీ గా ఉంది. అక్కినేని హీరోలందరితో సినిమాలు చేయాలనుంది. చైతన్యతో కూడా త్వరలోనే ఒక సినిమా చేయాలనుకుంటున్నా. ప్రస్తుతం తను వెరీ బిజీ.


నాగార్జున గారు అలా అన్నారు

నాగార్జున గారు సినిమా చూసాక నిన్నొక హ్యాపీ ఫిలిం తీసి పెట్టమని చెప్పాను. చాలా హ్యాపీ సినిమా చేశావ్ నేను చాలా హ్యాపీ అండ్ కాన్ఫిడెంట్ గా ఉన్నానని చెప్పారు.

‘జీ 5’ కి థాంక్స్

నేను హీరోగా చేసిన థ్రిల్లర్ సినిమా ‘దృష్టి’ లేటెస్ట్ గా జీ 5 లో పెట్టారు. ముందుగా’జీ 5 ‘వారికి థాంక్స్. మా ప్రొడ్యూసర్స్ నాకు కాల్ చేసి ఈ సినిమాను జీ 5 కి ఇస్తున్నాం అని చెప్పగానే హ్యాపీ గా ఫీలయ్యాను. నాకెలాంటి ఇబ్బంది లేదు. గో హెడ్ అన్నాను. ప్రస్తుతం ఆ సినిమా చూసిన వాళ్ళు పర్సనల్ గా మెసేజెస్ చేస్తూ చెప్పడం నటుడిగా ఆనందాన్నిచ్చింది.

ట్రిప్ పూర్తయ్యాకే

నా నెక్స్ట్ సినిమా ఏంటి.. ఎవరితో అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. ప్రెజెంట్ ఈ సినిమా గురించి ఆలోచిస్తున్నాను. ఆగస్ట్ 15 తర్వాత ఒక ట్రిప్ ప్లాన్ చేస్తున్నాను. ఆ ట్రిప్ పూర్తయ్యాక అప్పుడు నెక్స్ట్ సినిమాకు స్క్రిప్ట్ రెడీ చేసుకుంటాను.