రాహుల్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

Monday,May 15,2017 - 06:00 by Z_CLU

హ్యాపీ డేస్ సినిమాలో టైసన్ గా ఆకట్టుకొని ఆ తర్వాత సోలో హీరోగా తనకంటూ గుర్తింపు అందుకున్న రాహుల్ లేటెస్ట్ గా ‘వెంకటాపురం’ సినిమాతో థియేటర్స్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా ఇటీవలే విడుదలై మంచి టాక్ తో దూసుకెళ్తుంది.. ఈ సందర్భంగా zeecinemalu.com తో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడాడు హీరో రాహుల్.

‘వెంకటాపురం’ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు..?

చాలా హ్యాపీ గా ఉంది.. 10 ఏళ్ల తర్వాత ఒక మంచి సక్సెస్ అందించారు ఆడియన్స్. రిలీజ్ డే నుంచి విపరీతంగా కాల్స్, మెసేజెస్ వస్తూనే ఉన్నాయి. ఇండస్ట్రీలో కొంత మంది హీరోస్, పెద్ద వాళ్ళు ఫోన్ చేసి బాగుందని చెప్తున్నారు. ఈ సినిమా విషయంలో మేం పడిన కష్టాలన్నీ రిలీజ్ తర్వాత ఆడియన్స్ రెస్పాన్స్, కలెక్షన్స్ చూసి మర్చిపోయాం.  ఈ సినిమాను ఇంత సక్సెస్ చేసిన ప్రేక్షకులకు స్పెషల్ గా థాంక్స్.

‘వెంకటాపురం’ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్ డీటెయిల్స్ చెప్పండి ?

ప్రెజెంట్ ఆడియన్స్ నుంచి సినిమాకు వస్తున్న రెస్పాన్స్, థియేటర్స్ కలెక్షన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అందుకే వాళ్ళకి థాంక్స్ చెప్పడానికి 2 రోజుల్లో ఓ సక్సెస్ టూర్ ప్లాన్ చేస్తున్నాం. ఈ టూర్ విజయవాడ నుంచి స్టార్ట్ చేసి గుంటూరు, ఏలూరు,భీమవరం,రాజమండ్రి,కాకినాడ, వైజాగ్ మీదుగా విజయనగరం వరకూ ప్లాన్ చేస్తున్నాం.

‘వెంకటాపురం’ రిలీజ్ తర్వాత ఎలాంటి ఆఫర్స్ వస్తున్నాయి..

హ్యాపీడేస్ తర్వాత సోలో హిట్ కాబట్టి చాలామంది వెంకటాపురం సినిమా చూసి కాల్స్ చేస్తున్నారు. కొందరు నా కోసం ఓ కథ రాశామని వినమని ఫోన్స్ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం కె.ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఓ రెండు సినిమాలు కమిట్ అయ్యాను. అందులో ఒకటి ప్రీ ప్రొడక్షన్ లో ఉంది. ప్రెజెంట్ వెంకటాపురం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నా త్వరలోనే నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేస్తా..

నెక్స్ట్ చేయబోయే సినిమాలకి ఎలాంటి స్టోరీస్ సెలెక్ట్ చేసుకోబోతున్నారు..?

సినిమాకి కథే ప్రాణం.. వెంకటాపురం అందించిన సక్సెస్ తో మరిన్ని మంచి కథలు స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయాలనీ ఉంది.. అందుకే కథల విషయం లో చాలా జాగ్రత్త తీసుకుంటున్నా.. నెక్స్ట్ చేయబోయే సినిమా చాలా డిఫరెంట్ గా ఉండబోతోంది. మిగతావి కూడా కొత్త జానర్స్ లోనే కొత్తగా ఉండేలా చూసుకుంటున్నా.

ఈ సినిమాలో మీ యాక్టింగ్ & లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది కదా.. నెక్స్ట్ సినిమాకి ఇదే లుక్ మైంటైన్ చేస్తారా..?

చాలా మంది కాల్స్ చేసి మీ యాక్టింగ్ చాలా కొత్తగా ఉంది. అసలు ఊహించలేదు అంటున్నారు.. ఇక లుక్ విషయానికొస్తే ఒక్కో సినిమాకి ఒక్కోలా కనిపించాలి.. ఆ కథని ఆ క్యారెక్టర్ బట్టే లుక్ ఫిక్స్ అవుతా.. అంతే కానీ ఈ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది కదా అని ఇదే రిపీట్ చేస్తే మరో కథ కి సెట్ కాకపోవచ్చు. నిజానికి వెంకటాపురం కథ చెప్పినప్పుడే బాడీ తో పాటు హెయిర్, లుక్ అన్ని విషయాల్లో కేర్ తీసుకొని కొత్తగా కనిపించడానికి బాగా కష్టపడ్డా.. సో ఆ లుక్ కి ప్రెజెంట్ వస్తున్న రెస్పాన్స్ తో చాలా హ్యాపీ.

సినిమాకి బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా ప్లస్ అయింది.. అచ్చు గురించి చెప్పండి..?

అచ్చు తన మ్యూజిక్ తో సినిమాను బాగా ఎలివేట్ చేశాడు. వెరీ టాలెంటెడ్. తనకి మ్యూజిక్ లో అన్నీ తెలుసు మ్యూజిక్ నాలెడ్జ్ చాలా ఉంది. అన్నీ తనే చేస్తుంటాడు. మల్టీ టాలెంటెడ్. మెయిన్ గా ఆర్.ఆర్ జరుగుతున్నప్పుడు సౌండ్ మీద తనకి ఉన్న అవగాహనతో అద్భుతమైన స్కోర్ అందించి మ్యూజిక్ తో మెస్మరైజ్ చేశాడు.

ఈ సినిమాలో మీ డబ్బింగ్ పై కొన్ని విమర్శలొచ్చాయి.. దానిపై మీ అభిప్రాయం ?

ఏదైనా కొంచెం కొత్తగా ట్రై చేసినప్పుడు అది కొందరికి నచ్చొచ్చు, నచ్చక పోవచ్చు. సో అందరికీ నన్ను చూడగానే హ్యాపీ డేస్ లో మాటలే గుర్తుకొస్తాయి.  వాళ్ళకి ఈ వాయిస్ కాస్త నచ్చకపోవచ్చు. బట్ ఈ సినిమాకి మాత్రం నా ఒరిజినల్ వాయిస్ అస్సలు వర్కౌట్ అవ్వదు. చాలా మంది వాయిస్ లు టెస్ట్ చేసి ఫైనల్ గా ఈ వాయిస్ సూట్ అయిందనిపించింది. నెక్స్ట్ టైం దానిపై మరింత కేర్ తీసుకుంటా.

ప్రెజెంట్ యంగ్ హీరోస్ మల్టీస్టారర్ సినిమాలు చేస్తున్నారు. మీకు మల్టీస్టారర్ చేసే ఆలోచన ఉందా..?

మంచి కథ దొరికితే కచ్చితంగా చేస్తా.. నిజానికి నేను ఎంట్రీ ఇచ్చిన హ్యాపీ డేస్ లో నలుగురిలో నేను ఒకడినే కదా.. సో నాకు అలాంటి ప్రాబ్లమ్ లేదు.. కథ, క్యారెక్టర్ నచ్చితే ఎలాంటి సినిమా అయినా, విలన్ క్యారెక్టర్ అయినా చేస్తా…

‘వెంకటాపురం’ దర్శకుడు వేణుతో మరో సినిమా చేస్తారా?

కచ్చితంగా చేస్తా..దర్శకుడిగా తన విజన్ తో సినిమాను ఇంటరెస్టింగ్ స్క్రీన్ ప్లే తో నడిపించాడు. చాలా టాలెంటెడ్ డైరెక్టర్.. ఈ కథ నాకు చాలా ఏళ్ళ క్రితమే చెప్పాడు. నన్ను నమ్మి నాకోసం అప్పటి నుంచి వెయిట్ చేసినందుకు తనకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ప్రస్తుతం ఒక కథ రాస్తున్నాడు.. నాకు సూట్ అయ్యే కథ ఉండి తను చేద్దాం అంటే నేను ఎప్పుడూ రెడీ.

నెక్స్ట్ సినిమా డీటెయిల్స్ ?

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది. కె.ప్రొడక్షన్స్ బ్యానర్ లో రంగరాజు అనే దర్శకుడితో సినిమా ఉంటుంది. రంగరాజు దాదాపు ఏడాది నుంచి నాతో ట్రావెల్ చేస్తున్నాడు. తను మంచి డైరెక్టర్ అవుతాడనే నమ్మకం ఉంది. సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రీ ప్రొడక్షన్ కి టైం తీసుకుందామని డిసైడ్ అయ్యాం. ఆ సినిమాలో నా లుక్ కూడా చాలా కొత్తగా ఉండబోతుంది. అందుకే వెయిట్ తగ్గడం, గడ్డం పెంచడం మొదలుపెట్టాను. ఆ సినిమా సెట్స్ పైకి రావడానికి ఇంకో 3 నెలలు టైం పడుతుంది.

నటుడిగా డ్రీం రోల్ ఏదైనా ఉందా ?

ఉంది. ఒక అగ్రెస్సివ్ -ఇంటెన్స్ తో కూడిన క్యారెక్టర్ చేయాలని ఉండేది. కానీ వెంకటాపురంతో అది కొంత వరకూ నెరవేరింది. కానీ ఎప్పటి నుంచో ఒక సైకో క్యారెక్టర్ చేయాలనుంది. అలాంటి క్యారెక్టర్ తో ఒక మంచి కథ దొరికితే కచ్చితంగా  సినిమా చేస్తా…