రఘవరన్ బీటెక్ పార్ట్-2 ప్రారంభం

Thursday,December 15,2016 - 05:10 by Z_CLU

సౌత్ లో ఇద్దరు బీటెక్ బాబులున్నారు. కృష్ణంవందే జగద్గురుం సినిమాలో రానా బీటెక్ బాబుగా కనిపిస్తాడు. ఇక తమిళ్ హీరో ధనుష్ కూడా రఘువరన్ బీటెక్ సినిమాతో బీటెక్ బాబు అనిపించుకున్నాడు. తమిళ్ లో సూపర్ హిట్ అయిన వీఐపీ సినిమానే తెలుగులో రఘువన్ బీటెక్ గా వచ్చింది. ఇప్పుడు వీళ్లలో ధనుష్.. మరోసారి బీటెక్ బాబుగా కనిపించబోతున్నాడు. అవును.. వీఐపీ-2 సినిమా గ్రాండ్ గా ప్రారంభమైంది.

dhanush-vip-amala-paul-2

రఘువరన్ బీటెక్ సినిమాకు పార్ట్-2 వస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు సౌందర్య ఈ సీక్వెల్ కు దర్శకురాలు. గతంలో ఈమె సూపర్ స్టార్ తో కొచ్చడయాన్ సినిమా తెరకెక్కించారు. మొదటి సినిమాలో ఉన్న అమలాపాల్ నే సీక్వెల్ లో కూడా హీరోయిన్ గా తీసుకున్నారు. ఈరోజు ఈ సినిమా చెన్నైలో ప్రారంభమైంది. సూపర్ స్టార్ రజనీకాంత్ క్లాప్ కొట్టి సినిమాను లాంఛనంగా ప్రారంభించారు.