సిల్వర్ జూబ్లీ సినిమా మిస్సయిన దర్శకుడు

Tuesday,May 12,2020 - 05:16 by Z_CLU

కొన్ని కాంబినేషన్స్ ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఆసక్తి నెలకొల్పుతాయి. ఆ కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే చాలు అంచనాలు పెరిగిపోతాయి. అలాంటి క్రేజీ కాంబినేషనే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు-శ్రీదేవి ది. అవును.. వీరిద్దరి కాంబినేషన్ లో 24 సినిమాలొచ్చాయి. వాటిలో భారీ హిట్స్ కూడా ఉన్నాయి. అందుకే ఇద్దరూ కలిసి సిల్వర్ జుబ్లీ సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రావాలనుకున్నారు.

శ్రీదేవి నటించిన చివరి సినిమా ‘మామ్’ ప్రెస్ మీట్ లో దర్శకేంద్రుడు తమ కాంబినేషన్ లో సిల్వర్ జుబ్లీ సినిమా చేయాలని ఉందని తెలిపారు. దానికి వెంటనే శ్రీదేవి కూడా తప్పకుండా అన్నట్టు ఆయన కాళ్ళ మీద పడి నమస్కరించుకుంది.

ఈ విషయాన్ని ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా గుర్తుచేసుకొని బాధపడ్డారు రాఘవేంద్రరావు. శ్రీదేవి హఠాత్తుగా మరణించడం వల్ల వీరిద్దరి కాంబినేషన్ 25వ సినిమా చూసే అవకాశం మిస్ అయ్యారు తెలుగు ప్రేక్షకులు.