రాఘవేంద్రరావు ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

Tuesday,February 07,2017 - 09:06 by Z_CLU

భక్తిరస సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన రాఘవేంద్రరావు… నాగార్జున కథానాయకుడిగా తీసిన డివోషనల్ మూవీ ‘ఓం నమో వేంకటేశాయ’. ఫిబ్రవరి 10న ఈ సినిమా థియేటర్స్ లోకి రానున్న సందర్భంగా దర్శకేంద్రుడు మీడియాతో మాట్లాడారు.

భక్తిభావంతో….

ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించాను. కానీ ఈ సినిమా మాత్రం ప్రతీ రోజు అందరం గోవింద నామాలు పెట్టుకొని చేశాం. లైట్ బాయ్ నుంచి హీరో వరకూ అందరం మొదట దేవుడికి దండం పెట్టుకున్నాకే షూటింగ్ స్టార్ట్ చేసేవాళ్ళం. మొదటి రోజు టెంపుల్ సెట్లో హారతితో షూటింగ్ స్టార్ట్ అవ్వడంతో యూనిట్ అంతా ఎంతో భక్తిభావంతో పని చేశారు. అందులో కొందరు నాస్తికులు కూడా ఉండొచ్చు. అయినా అందరు ఒక భక్తితో ప్రతీ సీన్ ఫీల్ అవుతూ వర్క్ చేశారు.

ఆ మూడు చరిత్రల్లో డిఫరెన్స్ ఉంది

దాదాపు 32 వేల కీర్తనలు భక్తితో రచించి తన జీవితాన్ని వెంకటేశ్వర స్వామికి అంకితం ఇచ్చారు అన్నమయ్య. రామదాసు తన భజనలతో రాముడిని అలరించి.. కోదండరాముడికి గుడి కట్టి చరిత్రలో నిలిచారు. ఇక హథీరాం బాబా చరిత్రకి వస్తే దాదాపు 5 వందల ఏళ్ల క్రితం నాటిది. దేవుడిని వెతుక్కుంటూ తిరుమలకి వచ్చి శ్రీనివాసుడికి ప్రియ భక్తుడిగా మారి ఆయనతో పాచికలు ఆడుకున్న అద్భుతమైన చరిత్ర హథీరాం బాబాది. ఇలా నేను తెరకెక్కించిన ఈ 3 సినిమాలు 3 అద్భుతమైన చరిత్రలు.

ragha-141
*నాగార్జున ఒప్పుకోలేదు

అన్నమయ్య వచ్చి దాదాపు 20 ఏళ్ళు గడిచింది. మళ్ళీ వెంకటేశ్వర స్వామి మీద సినిమా చేద్దాం అనగానే అన్నమయ్య లాంటి కథ ఉండదండి అని ముందు నాగార్జున ఒప్పుకోలేదు. కాదు ఈ కథ ఒక్కసారి వినండి అని బలవంతంగా… నేను భారవి గారు కలిసి కథ చెప్పాక ఫైనల్ గా ఓకే బాగుంది ప్రొసీడ్ అన్నారు.

 

 

*నాగ్ చేయకపోతే 

ఈ సినిమా నాగార్జున చేయకపోతే తీసేవాళ్ళం కాదు. అలా అని వేరే ఎవ్వరు ఆ క్యారెక్టర్ ని చేయలేరని కూడా కాదు. కానీ ‘అన్నమయ్య’ తర్వాత ఇలాంటి క్యారెక్టర్ నాగార్జున చేస్తేనే బాగుంటుందనే ఫీలింగ్ ఆడియన్స్ లో ఉంది. అలా ఈ క్యారెక్టర్ రాసుకున్నప్పటి నుంచే  నాగార్జునను అనుకున్నాం..

*దాని కోసమే 7 నెలలు పట్టింది

ఈ కథ అనుకోగానే హథీరాం బాబాతో వెంకటేశ్వర స్వామి పాచికలు ఆడే స్థలం వెతకడానికి దాదాపు 7 నెలలు పట్టింది. తిరుమల కొండపై పర్మిషన్ ఉండదు కాబట్టి అలాంటి కొండ ప్రదేశాల్లో షూటింగ్ చేయాలనీ చాలా ప్రదేశాలు వెతికాం. ఫైనల్ గా మా కెమెరామెన్, ఆర్ట్ డైరెక్టర్ మహాబలేశ్వరం, చిక్ మంగుళూరు ప్రదేశాలు షూట్ చేసుకొని వచ్చి నాకు చూపించారు. మేం అనుకున్న ప్రదేశం లానే ఉండడంతో దాదాపు ఆ అక్కడే షూట్ చేశాం.

ragha-115
*ఆయన ఒక ఎస్సెట్

కీరవాణి మ్యూజిక్ ఈ సినిమాకు ఒక పెద్ద ఎస్సెట్. ఈ సినిమాలో కొన్ని గోవింద నామాల కోసం ఎంతో అద్భుతమైన సాహిత్యం రాయించి పాటలతో హైలైట్ గా నిలిచారు. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఈ సినిమాకు చాలా ప్లస్ అవుతుంది.

 

*వాళ్ళు కూడా చేస్తే బాగుంటుంది….

నిజం చెప్పాలంటే మన తెలుగుజాతికి ఎంతో చరిత్ర ఉంది. ఎంతో మంది మహాభక్తుల చరిత్రలు ఉన్నాయి. ఇక భక్తిరస సినిమాలు తీయాలంటే రాఘవేంద్ర రావు గారే తీయాలి అనుకోకుండా ఇప్పుడున్న యంగ్ జనరేషన్ డైరెక్టర్స్ కూడా ఇలాంటి చారిత్రాత్మక సినిమాలు చేయాలి. చేస్తే బాగుంటుందని అనుకుంటున్నా. ఎందుకంటే భావితరాలకు మన చరిత్రలు సినిమా రూపంలో తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి దర్శకుడికీ ఉంది.

*లెంగ్త్ కోసం కాదు

కొన్ని సినిమాలను ఒరిజినల్ కథతో కొన్ని కల్పిత సన్నివేశాలతో తెరకెక్కిస్తాం. అలా చేసేది ఏదో నిడివి కోసం కాదు. కేవలం ఆడియన్స్ పై ఇంపాక్ట్ చూపిస్తుందనే కారణంతోనే అలా కొన్ని కల్పితాలు చేస్తాం. నిజానికి ‘అన్నమయ్య’ క్లయిమాక్స్ మాకు దొరికిన చరిత్రలో లేదు. అది కల్పితమే. ఆ క్లైమాక్స్ కి గొప్ప రెస్పాన్స్ వచ్చింది ఇప్పటికీ ఆ క్లైమాక్స్ గురించి ఎంతో మంది నాతో చెప్తూ ఉంటారు. ఇక ఈ సినిమాలో కూడా కొన్ని కల్పితమైన సన్నివేశాలు ఉంటాయి.

ragha-150
*రెండూ సమానంగా ఉంటాయి

అన్నమయ్య క్లైమాక్స్ ఈ సినిమా క్లైమాక్స్ నా దృష్టిలో సరిసమానంగా ఉంటాయి. రెండిటిలో ఏది ఎక్కువ ఏది తక్కువ అంటే చెప్పలేం. రేపు సినిమా చూసాక మీరు కూడా ఆ విషయాన్ని ఒప్పుకుంటారు.

 

*ఆ యాాంగిల్ లో చూస్తారు

తిరుమలకి ఉన్న చరిత్ర, స్థల పురాణాలు, శ్రీహరి శ్రీనివాసుడు ఎలా అయ్యాడు.. శ్రీనివాసుడు గోవిందుడు ఎలా మారాడు.. అనే కొత్త విషయాలను ఈ క్యారెక్టర్ తో చెప్పే ప్రయత్నం చేశాం. ఈ సినిమా చూసాక కచ్చితంగా తిరుమల వెళ్లి ప్రతీ స్థలాన్ని ఈ సినిమా యాంగిల్ లో చూస్తారని గట్టిగా నమ్ముతున్నా….

*ఇద్దరికీ సంబంధం ఉండదు

ఈ సినిమాలో అనుష్క ఒక భక్తురాలిగా మాత్రమే కనిపిస్తుంది. నాగార్జున, అనుష్కకి సంబంధమే ఉండదు. ఇద్దరు మహాభక్తులు అంతే. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి డ్యూయెట్ సాంగ్స్, రొమాంటిక్ సీన్స్ గానీ ఉండవు.

 

*ఎన్నో అద్భుతాలు జరిగాయి

ఈ సినిమా ప్రారంభం నుంచి ఎన్నో అద్భుతాలు జరిగాయి. షూటింగ్ లో ఆశ్చర్యపరిచే సన్నివేశాలు ఎదురయ్యాయి. మొదటి రోజు షూట్ నుంచి లాస్ట్ షాట్ వరకూ వెంకటేశ్వర స్వామి మాకు శక్తినిచ్చి ముందుకు నడిపించారు. ‘అన్నమయ్య’ విషయంలో కూడా అదే జరిగింది. ఎన్నో రోజుల నుంచి పర్మిషన్ ఎలా ఇస్తారనే విషయంపై చర్చ జరిగినప్పటికీ కొండ మీద లాస్ట్ షాట్ షూట్ పూర్తయ్యాకే షూటింగ్ ఆపేయమని నోటీస్ వచ్చింది…

*ఇంకా డిసైడ్ అవ్వలేదు

ఈ సినిమా తర్వాత ఎలాంటి సినిమా తీయాలి.. ఇంకా డిసైడ్ అవలేదు. అన్ని భక్తి సినిమాలే చేస్తానని కూడా చెప్పను. మంచి కథ దొరికి అందులో సోషల్ మెసేజ్ ఉండి, కమర్షియల్ గా చెప్పగలిగేలా ఉంటే బయోపిక్ సినిమా చేసే ఆలోచన కూడా ఉంది. భక్తుల వేట మాత్రం కొంత వరకూ ఆగుతుంది(నవ్వుతూ)