Radheshyam - రేపే ట్రయిలర్ రిలీజ్

Wednesday,December 22,2021 - 07:29 by Z_CLU

Radheshyam Trailer to release tomorrow

ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా గ్రాండ్ ఈవెంట్ కు అంతా రెడీ అయింది. రేపు సాయంత్రం రాధేశ్యామ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున సెలబ్రేట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి రామోజీ ఫిలింసిటీలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాధేశ్యామ్ ట్రయిలర్ (Radheshyam Trailer)ను రేపు రిలీజ్ చేయబోతున్నారు. హైలెట్ ఏంటంటే.. ఫంక్షన్ కు చీఫ్ గెస్టులు ఎవ్వరూ లేరు. ప్రభాస్ అభిమానుల చేతుల మీదుగా ఈ ట్రయిలర్ లాంచ్ కాబోతోంది.

రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా టీజర్ ఉంది. ఇక సాంగ్స్ అయితే సూపర్ డూపర్ హిట్టయ్యాయి. వీటన్నింటికంటే ముందు రిలీజ్ చేసిన ప్రభాస్, పూజాహెగ్డే ఫస్ట్ లుక్ వీడియోస్ అయితే తెగ వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఫైనల్ గా రాధేశ్యామ్ ట్రయిలర్ ను లాంఛ్ చేస్తున్నారు.

రాధేశ్యామ్ కథ ఏంటనేది మేకర్స్ ఇప్పటికే చూచాయగా బయటపెట్టారు. ప్రభాస్ ఇందులో విక్రమాదిత్యగా కనిపించబోతున్నాడు. చేయి చూసి జాతకం కచ్చితంగా చెప్పే వ్యక్తిపాత్ర ఇది. ఇక ప్రేరణగా పూజా హెగ్డే కనిపించనుంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న వరల్డ్ వైడ్ థియేటర్లలోకి రాబోతోంది రాధేశ్యామ్.