Zee Radheshyam - థీమ్ పార్క్ సూపర్ హిట్

Monday,June 20,2022 - 12:24 by Z_CLU

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ఈ ఆదివారం (జూన్ 26) సాయంత్రం 6 గంటలకు Zee Teluguలో టెలికాస్ట్ అవుతుంది. ఈ మూవీ ప్రమోషన్ కోసం డిఫరెంట్ స్ట్రాటజీస్ ఫాలో అవుతోంది జీ తెలుగు. ఇందులో భాగంగా Radheshyam Theme Park ఏర్పాటుచేసింది.

భీమవరంలో ఏర్పాటుచేసిన ఈ థీమ్ పార్క్ సూపర్ హిట్టయింది. సినిమాలో ప్రభాస్-పూజాహెగ్డే మధ్య వచ్చే కీలకమైన సన్నివేశాలకు సంబంధించిన ఎలిమెంట్స్ ను ఈ థీమ్ పార్క్ లో ఏర్పాటుచేశారు. ఓ షిప్, పెద్ద పియానో, ప్రభాస్ జాతకం చెప్పే పెద్ద కటౌట్, రైల్వే స్టేషన్ బెంచ్.. ఇలా Radheshyam Movieని మరోసారి గుర్తుకుతెచ్చేలా ఈ థీమ్ పార్క్ ఏర్పాటైంది. ఈ కాన్సెప్ట్ బ్లాక్ బస్టర్ హిట్టయింది. సినిమాపై బజ్ క్రియేట్ చేసింది.

తమ సినిమాల కోసం జీ తెలుగు ఇలా వినూత్నంగా ప్రచారం చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా Pawan Vakeelsaab సినిమాను ప్రసారం చేసినప్పుడు కూడా డిఫరెంట్ గా ప్రమోషన్ చేసింది. గ్రాఫిటీ పెయింటింగ్స్ లాంటి ప్రయోగాలు చేసింది. ఇన్నొవేటివ్ కాన్సెప్ట్స్ కింద అవార్డులు కూడా అందుకుంది. ఇప్పుడు రాధేశ్యామ్ సినిమా కోసం మరోసారి తన క్రియేటివిటీ చూపిస్తోంది.

జూన్ 26, ఆదివారం సాయంత్రం 6 గంటలకు రాధేశ్యామ్ సినిమాను జీ తెలుగులో చూసి ఎంజాయ్ చేయండి. ప్రభాస్-పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన ఈ రొమాంటిక్ లవ్ జర్నీని మీరూ ఎక్స్ పీరియన్స్ చేయండి.

Radheshyam World Television Premiere – Zee Telugu – June 26 – 6PM