Radheshyam - షూటింగ్ అప్ డేట్స్

Tuesday,June 29,2021 - 03:43 by Z_CLU

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ‘జిల్’ ఫేం రాదా కృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న ‘రాధే శ్యామ్’ సినిమా మళ్ళీ సెట్స్ పైకి వచ్చేసింది. మూడు రోజుల నుండి ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ప్రభాస్ మిగతా నటీ నటులపై కీలక సన్నివేశాలు తీస్తున్నారు. మరికొన్ని రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యుల్ తో టోటల్ షూటింగ్ కంప్లీట్ అవ్వనుంది. ఇప్పటికే ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో బిజినెస్ కూడా క్లోజ్ అయింది. కొన్ని ఏరియాల్లో యూ.వి సంస్థనే డిస్ట్రిబ్యూట్ చేయనుంది.

చకచకా పనులన్నీ చేసేస్తున్నారు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసి సినిమా థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చే రోజు ప్రకటించే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. పిరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. చాలా గ్యాప్ తర్వాత ప్రభాస్ లవ్ స్టోరీ చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా అంచనాలు నెలకొంటున్నాయి.

ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన భారీ సెట్స్ లో కీలక సన్నివేశాలు తీస్తున్నారు యూనిట్. సినిమాలో వచ్చే ఇటలీ సన్నివేశాలు మెయిన్ హైలైట్స్ అని తెలుస్తుంది. గోపికృష్ణ మూవీస్ పై కృష్ణం రాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ , T సిరీస్ నిర్మిస్తున్న ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. త్వరలోనే సినిమా నుండి మొదటి సాంగ్ రిలీజ్ కానుందని సమాచారం.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics