RadheShyam Teaser - టీజర్ లో హైలెట్ పాయింట్స్ ఇవే!

Saturday,October 23,2021 - 02:35 by Z_CLU

RadheShyam Prabhas Character Reveal Teaser Review

రాధేశ్యామ్ లో ప్రభాస్ లుక్ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. అతడి క్యారెక్టర్ పేరు విక్రమాదిత్య అనే విషయం కూడా ముందే తెలుసు. అయితే సినిమాలో అతడి పాత్ర ఏంటనేది మాత్రం నిన్నటివరకు సస్పెన్స్. చాలామంది ప్రభాస్ ను లవర్ బాయ్ అనుకున్నారు. డార్లింగ్, మిర్చి తర్వాత లవర్ బాయ్ గా కనిపిస్తున్నాడని అనుకున్నారు. కానీ రాధేశ్యామ్ లో ప్రభాస్ క్యారెక్టర్ అంతకుమించి.

“నువ్వు ఎవరో నాకు తెలుసు, కానీ నేను చెప్పను. నీ మనసు ఎప్పుడు విరిగిపోతుందో నాకు తెలుసు, కానీ చెప్పను. నీ పెయిల్యూర్స్ నేను చూడగలను, కానీ చెప్పను. నీ చావు కూడా నాకు తెలుస్తుంది, కానీ చెప్పను. నాకు అన్నీ తెలుసు, కానీ చెప్పను. నేను దేవుడ్ని కాదు, అలా అని మీలో ఒక్కడ్ని కూడా కాదు. నా పేరు విక్రమాదిత్య.”

ఈ డైలాగ్స్ తో రాధేశ్యామ్ లో ప్రభాస్ క్యారెక్టర్ ఏంటనేది చెప్పేశారు. సినిమాలో చేయి చూసి జాతకాలు చెప్పే జ్యోతిష్కుడి (Palmist)గా ప్రభాస్ కనిపించబోతున్నాడు. అందరూ అనుకుంటున్నట్టు అతడిది జస్ట్ లవర్ బాయ్ క్యారెక్టర్ కాదు, ఎంతో డెప్త్ ఉన్న ఓ బరువైన పాత్ర.

radheshyam prabhas

పాన్ ఇండియా మూవీగా వస్తున్న రాధేశ్యామ్ సినిమా టీజర్ కోసం మేకర్స్ ఓ ఎవర్ గ్రీన్ ఆలోచనతో ముందుకొచ్చారు. ఒక్కో భాషలో టీజర్ కోసం డబ్బింగ్ చెప్పించే పని ఆపేశారు. ప్రభాస్ తో ఫస్ట్ టైమ్ ఇంగ్లిష్ లో డైలాగ్స్ చెప్పించి, టీజర్ కు యూనివర్సల్ అప్పీల్ ఇచ్చారు. మొత్తం 8 భాషల్లో సబ్-టైటిల్స్ పెట్టారు. వీటిలో జపనీస్, స్పానిష్, చైనీస్ లాంటి ఇంటర్నేషనల్ లాంగ్వెజెస్ కూడా ఉన్నాయి

ఈ టీజర్ తో రాధేశ్యామ్ పై అంచనాలు ఆకాశాన్నంటాయి. ప్రభాస్ లుక్ అందర్నీ మెస్మరైజ్ చేసింది. ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్ గా వచ్చిన ఈ టీజర్ లో విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, గ్రాఫిక్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. టీజరే ఇలా ఉందంటే, త్వరలోనే వచ్చే ట్రయిలర్, ఆ తర్వాతొచ్చే సినిమా ఇంకే రేంజ్ లో ఉంటుందో ఊహించుకుంటూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics