RadheShyam - రిలీజ్ డేట్ ఫిక్స్

Wednesday,December 30,2020 - 01:43 by Z_CLU

టాలీవుడ్ మోస్ట్ ఎవెయిటింగ్ మూవీస్ లో ఒకటి Radheshyam. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం షూట్ ఫినిషింగ్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. కుదిరితే ఏప్రిల్ 30న రాధేశ్యామ్ ను థియేటర్లలోకి తీసుకురావాలనుకుంటున్నారు.

అయితే ఇది అన్-అఫీషియల్ మాత్రమే. సంక్రాంతి తర్వాత రాధేశ్యామ్ రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా ఎనౌన్స్ చేస్తారు. PrabhasPooja Hegde హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు రాధాకృష్ణ కుమార్ దర్శకుడు.

పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమా ఈపాటికే రెడీ అవ్వాల్సింది. కానీ లాక్ డౌన్ కారణంగా మూవీ మరింత ఆలస్యమైంది. దీంతో తనవంతుగా ఈ సినిమాకు మరిన్ని కాల్షీట్లు కేటాయించింది హీరోయిన్ పూజా హెగ్డే. ఈ మూవీ కోసం ఓ బాలీవుడ్ ప్రాజెక్టును సైతం ఆమె వెనక్కిపెట్టింది.

Also Check – ఒక్క ఫైట్ కోసం రూ.2 కోట్లు