RadheShyam - కాస్ట్ లీ ఫైట్

Sunday,November 08,2020 - 04:33 by Z_CLU

కంప్లీట్ రొమాంటిక్ అండ్ లవ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతోంది రాధేశ్యామ్ మూవీ. ఇదొక పీరియాడిక్ లవ్ స్టోరీ. యాక్షన్ పార్ట్ చాలా తక్కువ. ఇంకా చెప్పాలంటే ఇంటర్వెల్ బ్యాంగ్ లో మాత్రమే ఒక ఫైట్ వస్తుంది. అయినప్పటికీ నిర్మాతలు కాంప్రమైజ్ అవ్వడం లేదు.

సినిమాలో ఉన్న ఆ ఒకే ఒక్క ఫైట్ కోసం కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీ అవుతోంది యూనిట్. అవును.. సింగిల్ యాక్షన్ ఎపిసోడ్ కోసం 2 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారు.

అంతేకాదు.. ఈ యాక్షన్ పార్ట్ కోసం హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ నిక్ పోవెల్ ను రంగంలోకి దించుతున్నారు. Bourne Identity, Gladiator లాంటి సినిమాలకు పోవెల్ వర్క్ చేశాడు.

ఇక షూటింగ్ అప్ డేట్స్ విషయానికొస్తే.. మూవీకి సంబంధించి ఇటలీ షెడ్యూల్ కంప్లీట్ అయింది. మరోసారి విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ లోనే మరో షెడ్యూల్ చేస్తే టోటల్ మూవీ కంప్లీట్ అయిపోతుంది.

వచ్చే ఏడాది సమ్మర్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి రాబోతోంది RadheShyam

Also Read – పని పూర్తిచేసిన ప్రభాస్