RadheShyam - ఫస్ట్ గ్లింప్స్ అదుర్స్

Sunday,February 14,2021 - 11:49 by Z_CLU

ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాధేశ్యామ్ హంగామా మొదలైంది. ప్రేమికుల రోజు కానుకగా ఈరోజు Radhe Shyam Glimpse రిలీజైంది. చాన్నాళ్ల తర్వాత లవర్ బాయ్ గెటప్ లో ప్రభాస్ ఫుల్ గా ఎట్రాక్ట్ చేశాడు.

గ్లింప్స్ లో స్పానిష్ లాంగ్వేజ్ లో పూజాహెగ్డేను పిలుస్తాడు ప్రభాస్. నువ్వేమైనా రోమియోను అనుకుంటున్నావా అంటుంది హీరోయిన్. “ఛ.. వాడు ప్రేమ కోసం చచ్చాడు.. నేను ఆ టైపు కాదు.” అంటాడు. ఇలా 52 సెకెన్ల నిడివి కలిగిన ఈ గ్లింప్స్ ఫస్ట్ లుక్ లోనే ఎట్రాక్ట్ చేస్తుంది.

గ్లింప్స్ తో పాటు RadheShyam Release Date కూడా ఎనౌన్స్ చేశారు మేకర్స్. జులై 30న ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదలకాబోతోంది.

సినిమాలో విక్రమాదిత్య రోల్ లో ప్రభాస్, ప్రేరణ పాత్రలో పూజా హెగ్డే కనిపించబోతున్నారు. ప్రభాస్ కు తల్లిగా అలనాటి గ్లామర్ హీరోయిన్ భాగ్యశ్రీ కనిపించనుంది. వింటేజ్ యూరోపియన్ బ్యాక్ డ్రాప్ లో కంప్లీట్ లవ్ స్టోరీగా రాబోతోంది రాధేశ్యామ్.