ముగ్గురు హీరోలతో....

Saturday,November 05,2016 - 04:29 by Z_CLU

టాలీవుడ్ లో ఓ ముగ్గురు హీరోలతో మూడు సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు నిర్మాత కె.కె.రాధా మోహన్. ‘ఏమైంది ఈవేళ’, ‘బెంగాల్‌టైగర్‌’ చిత్రాలను నిర్మించిన రాధామోహన్‌ ప్రస్తుతం పృద్వి, నవీన్ చంద్ర లతో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని నవంబర్ లో విడుదల కు కానుంది.

 producer-radha-mohan-ap7am-467559

  ఈ సినిమా విడుదలైన వెంటనే ముగ్గురు హీరోలతో సినిమాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు రాధా మోహన్. యంగ్‌ హీరో నాగశౌర్య హీరోగా జనవరిలో ఓ చిత్రాన్ని ప్రారంభించి, అలాగే హీరో గోపీచంద్‌ కథానాయకుడిగా ఇంకో చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ రెండు చిత్రాలతో పాటు నితిన్‌ హీరోగా మరో చిత్రాన్ని వచ్చే ఏడాదే ప్రారంభించబోతున్నారు.