నా కెరీర్ లోనే డిఫరెంట్ సినిమా

Wednesday,May 17,2017 - 05:37 by Z_CLU

శర్వానంద్ కొత్త సినిమా రాధ. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాతో చంద్రమోహన్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా తన కెరీర్ లో డిఫరెంట్ చిత్రంగా నిలిచిపోతుందంటున్నాడు హీరో శర్వానంద్. ఫస్ట్ టైం తను యాక్షన్ తో పాటు కామెడీ మిక్స్ చేసిన నటించిన రాధ సినిమాకు అన్ని ఏరియాస్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందంటున్నాడు శర్వానంద్.

 

ఈ సినిమా సక్సెస్ మీట్ హైదరాబాద్ లో జరిగింది. హీరో శర్వానంద్, హీరోయిన లావణ్య త్రిపాఠితో పాటు దర్శకుడు చంద్రమోహన్, నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ పాల్గొన్నారు. సినిమా హిట్ అయినందుకు, మరీ ముఖ్యంగా తన క్యారెక్టర్ క్లిక్ అయినందుకు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పాడు కమెడియన్ సప్తగిరి. రాధ సినిమాలో నాన్నకు ప్రేమతో స్పూఫ్ చేశాడు సప్తగిరి.