ఈరోజే 'రాధా' ఆడియో రిలీజ్

Wednesday,May 03,2017 - 03:00 by Z_CLU

లేటెస్ట్ గా ‘శతమానం భవతి’ సినిమాతో కెరీర్ లో గ్రాండ్ హిట్ అందుకున్న శర్వానంద్ త్వరలోనే ‘రాధా’ గా థియేటర్స్ లో సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు.. లేటెస్ట్ గా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఆడియో ను ఈరోజు సాయంత్రం సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్… సాయంత్రం 6 గంటల నుంచి ఈ సినిమాలోని అన్ని పాటలు ఆన్లైన్ లో అందుబాటులోకొస్తాయి…

ర‌ధ‌న్‌ సంగీతం అందించిన ఈ సినిమాలోని రెండు పాటలను లేటెస్ట్ గా సోషల్ మీడియా లో రిలీజ్ చేసిన మేకర్స్ ఈరోజు సాయంత్రం టోటల్ ఆల్బం ను రిలీజ్ చెయనున్నారు.. అవుటండ్ అవుట్ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా రూపొందుతున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.. అన్ని కార్యాక్రమాలు పూర్తిచేసి మే 12న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్..