దానికి ఇంకా టైం ఉంది

Monday,October 03,2016 - 10:44 by Z_CLU

 ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బొద్దుగుమ్మ రాశి ఖన్నా… వరుస ఆఫర్స్ దక్కించుకుంటూ విజయాలు అందుకుంటూ దూసుకుపోతుంది. ఇటీవలే ‘సుప్రీమ్ తో విజయం అందుకున్న ఈ భామ తాజాగా రామ్ తో కలిసి ‘హైపర్’ గా వచ్చి మరో సూపర్ హిట్ సొంతం చేసుకుంది. సిద్దార్థ్ సరసన ‘సైతాన్ కా బచ్చా’ అనే సినిమాతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమవుతుంది రాశి.

har_74721

         ఇలా వరుస సినిమాలతో కథానాయికగా స్పీడ్ పెంచిన రాశికి తెలుగులో డబ్బింగ్ చెప్పాలని ఉందట. కానీ అందుకు ఇంకా సమయం పడుతుందని చెబుతుంది. దీనికి కారణం తెలుగు రాకపోవడం కాదట ఇప్పటికే పూర్తిగా తెలుగు నేర్చేసుకున్న ఈ అమ్మడి కి డబ్బింగ్ చెప్పే టైం లేదట. త్వరలోనే తాను నటించే సినిమాలకు డబ్బింగ్ చెప్తానంటోంది రాశీఖన్నా.