రవితేజ సినిమాలో రాశి ఖన్నా స్పెషల్ ఎప్పీయరెన్స్

Thursday,September 14,2017 - 02:35 by Z_CLU

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న’రాజా ది గ్రేట్’ సినిమాకు మరో స్పెషల్ ఎలిమెంట్ యాడ్ అయింది. మెహరీన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ ప్రాజెక్టులోకి రాశి ఖన్నా కూడా ఎంటరైంది. ఓ సాంగ్ లో ‘షార్ట్ అండ్ స్పెషల్ ఎప్పీయరెన్స్’ ఇవ్వబోతున్నానని ప్రకటించింది రాశి.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాతో రవితేజ కొడుకు మహాధన్.. ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. సినిమాకు ఇదే పెద్ద హైలెట్ అనుకుంటే ఇప్పుడు రాశి కూడా మరో హైలెట్ గా నిలవనుంది. గతంలో రవితేజ నటించిన బెంగాల్ టైగర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది రాశి.

అయితే ఈ సినిమాలో అతిథి పాత్రలో మెరవడానికి మాత్రం రవితేజ రీజన్ కాదు. దర్శకుడు అనిల్ రావిపూడి కోసమే స్పెషల్ ఎప్పీయరెన్స్ ఇస్తున్నట్టు తెలిపింది రాశి ఖన్నా. గతంలో అనిల్ డైరక్ట్ చేసిన సుప్రీమ్ సినిమాతో అదిరిపోయే రోల్ చేసింది రాశి ఖన్నా. అందులో బెల్లం శ్రీదేవి పాత్ర ఆమెకు మంచి క్రేజ్ తీసుకొచ్చింది. ఆ అభిమానంతో అనిల్ అడిగిన వెంటనే రాజా ది గ్రేట్ లో స్పెషల్ ఎప్పీయరెన్స్ ఇచ్చేందుకు ఒప్పుకుంది ఈ బ్యూటీ.