'జంబలకిడిపంబ' ఫస్ట్ సింగిల్ రిలీజ్

Friday,May 18,2018 - 07:20 by Z_CLU

శ్రీనివాసరెడ్డి, సిద్ధి ఇద్నానీ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా జంబలకిడిపంబ. ఒకప్పటి సూపర్ హిట్ సినిమా టైటిల్ కావడంతో.. ఈ మూవీపై అందరి ఫోకస్ పెరిగింది. ఫస్ట్ లుక్ తో హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమాకు సంబంధించి కొద్దిసేపటి కిందట ఫస్ట్ ఆడియో సాంగ్ రిలీజ్ చేశారు. హీరోయిన్ రాశిఖన్నా చేతులమీదుగా ఈ సాంగ్ రిలీజైంది.

సోషల్ మీడియాలోని అన్ని ఆడియో ఫ్లాట్ ఫామ్స్ పై ఈ సింగిల్ అందుబాటులోకి వచ్చింది. సూపర్ హిట్ మ్యూజిక్ డైరక్టర్ గోపీసుందర్ కంపోజ్ చేసిన ఫస్ట్ సాంగ్ “మదిలో ఉన్న ప్రేమ” చాలా బాగుంది. సింగర్ రఘురామ్ ఈ పాటను ఆలపించారు. తనదైన స్టయిల్ లో వెస్ట్రన్ బీట్ కు మెలొడీ యాడ్ చేసి సింగిల్ కంపోజ్ చేశాడు గోపీసుందర్.కచ్చితంగా యూత్ కు కనెక్ట్ అయ్యేలా ఉంది సాంగ్.

పోసాని కృష్ణ‌ముర‌ళి, వెన్నెల కిశోర్ కీల‌క పాత్ర‌లు పోషించిన ఈ సినిమాకు జె.బి. ముర‌ళీకృష్ణ ద‌ర్శ‌క‌ుడు. ర‌వి, జోజో జోస్‌, శ్రీనివాస‌రెడ్డి.ఎన్ నిర్మాత‌లు. వచ్చేనెల 14న వరల్డ్ వైడ్ విడుదలకానుంది జంబలకిడి పంబ.