పాఠాలు నేర్చుకుంటున్న రాశిఖన్నా

Thursday,May 28,2020 - 01:56 by Z_CLU

ఈ లాక్ డౌన్ టైమ్ లో ఫుల్ బిజీ అయిపోయింది రాశిఖన్నా. ఇప్పటికే గిటార్ నేర్చుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు ఆన్ లైన్ లో తమిళ క్లాసులు ఎటెండ్ అవుతోంది. లీలా అనే టీచర్ ట్రయినింగ్ లో తమిళ్ నేర్చుకుంటోంది.

త్వరలోనే సూర్యతో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతోంది రాశిఖన్నా. తమిళ్ లో ఆమెకిది బిగ్ ప్రాజెక్ట్. అందుకే ఈ గ్యాప్ లో తమిళ్ నేర్చుకుంటే ఇంకాస్త కంఫర్టబుల్ గా ఉంటుందని రాశి ఫీలింగ్. అందుకే ఇలా ఆన్ లైన్ లో తమిళ క్లాసులు నేర్చుకుంటోంది.

ఢిల్లీలో పుట్టి పెరిగింది రాశిఖన్నా. కానీ టాలీవుడ్ లో క్లిక్ అవ్వడంతో తెలుగు నేర్చుకుంది. ఎంతలా అంటే ఏకంగా తెలుగులో డబ్బింగ్ కూడా చెప్పేస్తోంది. కుదిరితే తమిళ లాంగ్వేజ్ పై కూడా అదే స్థాయిలో పట్టు సాధించాలనుకుంటోంది ఈ బ్యూటీ.