రాశి ఖన్నా ఇంటర్వ్యూ
Saturday,September 16,2017 - 11:05 by Z_CLU
ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ అందుకుంటూ జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న సుప్రీమ్ భామ రాశి ఖన్నా త్వరలో ‘జై లవ కుశ’ సినిమాలో ఎన్టీఆర్ సరసన థియేటర్స్ లో సందడి చేయబోతుంది.. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీ అయిన ఈ సినిమా గురించి మీడియాతో ముచ్చటించింది రాశి ఖన్నా. మరి ఆ విశేషాలు రాశి మాటల్లోనే.
స్లిమ్ అవ్వడానికి రీజన్ అదే
గతంతో పోలిస్తే నా బరువు తగ్గింది. కొంచెం స్లిప్ అవ్వాను. దానికి రీజన్ ఫిట్ నెస్ కోసం అలాగే ఇంకాస్త అందంగా కూడా కనిపించాలన్న ఉద్దేశ్యంతోనే డైట్ మైంటైన్ చేస్తున్నాను.
నా రోల్ అలా ఉంటుంది
సినిమాలో ప్రియా అనే క్యారెక్టర్ చేసాను. మ్యారేజ్ బ్యూరో గా పెళ్లిళ్లు చేసే అమ్మాయిగా కనిపిస్తాను. లవ కి పెయిర్ గా చేసాను. ఈ క్యారెక్టర్ చేయడం చాలా సంతోషంగా ఉంది. స్వీట్ లవర్ క్యారెక్టర్ ఇది. బాబీ గారు చాలా బాగా రాశారు .కచ్చితంగా నా క్యారెక్టర్ కి థియేటర్స్ లో బాగా ఎంజాయ్ చేస్తారు.
బాబీ అడిగారు కానీ టైం కుదరలేదు
సినిమాలో నా క్యారెక్టర్ కి నన్నే డబ్బింగ్ చెప్పమని బాబీ అడిగారు. కానీ నాకు టైం కుదరలేదు. ఆల్మోస్ట్ ట్రావెలింగ్ కె బాగా టైం పట్టేసింది. నా వల్ల కాదని చెప్పాను. తెలుగు వచ్చు కాబట్టి త్వరలో నా క్యారెక్టర్ కి నేనే డబ్బింగ్ చెప్పుకుంటాను.
అస్సలు ఊహించలేదు
నిజాంనికి ఎన్టీఆర్ తో నటించే ఛాన్స్ వస్తుందని ఇంత పెద్ద సినిమాలో నేను పార్ట్ అవుతానని అస్సలు ఊహించలేదు. సడెన్ గా బాబీ నన్ను కలిసి ఈ స్క్రిప్ట్ అండ్ క్యారెక్టర్ గురించి వినిపించాడు. చెప్పగానే ఎగ్జైట్ గా ఫీలయ్యి ఓకే అనేశా..
గొప్ప టాలెంటెడ్
తారక్ టాలెంట్ గురించి సినిమాకి ముందు చాలా విన్నాను. కానీ సెట్స్ లో అడుగు పెట్టాకా స్వయంగా తెలిసింది.. గొప్ప టాలెంటెడ్ అని. చాలా డెడికేషన్ అండ్ ఫ్యాషనేట్. మూడు రోల్స్ తో సినిమా చేయడం, ఇంకో టీవీ షోకి హోస్ట్ గా చేయడం..నిద్ర లేకపోయినా, ట్రావెలింగ్ కి చాలా టైం పట్టినా ఓపికగా ఉంటూ నటించారు. నిజంగా తారక్ ఎనర్జీ లెవెల్స్ , డెడికేషన్ చూసి చాలా నేర్చుకున్నాను.
నివేత గుడ్ ఫ్రెండ్
నివేత నటించిన నిన్ను కోరి సినిమా చూశాను. తనతో కలిసి నటించడం చాలా హ్యాపీగా ఉంది. ఇద్దరం చాలా ఫ్రెండ్లీ గా ఉంటూ కలిసి సినిమా చేశాం. నివేత నటిగా ఇంకా ఉన్నత స్థానంకి వెళ్తుందని నా నమ్మకం.
నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ అదే
నిజం చెప్పాలంటే ఈ సినిమాలో తారక్ నటించిన మూడు క్యారెక్టర్స్ లో నాకు జై క్యారెక్టర్ బాగా నచ్చింది. తారక్ చాలా హార్డ్ వర్క్ చేసి డెడికేషన్ తో చేసిన క్యారెక్టర్ అది. తారక్ హై వోల్టాజ్ పెరఫార్మెన్స్,తడబడుతూ చెప్పే డైలాగ్స్ అన్ని కలగలిపి ఈ క్యారెక్టర్ అందరికి ఫెవరెట్ అవ్వడం ఖాయం.
నా క్యారెక్టర్ అలా ఉండదు
ప్రీవియస్ మూవీస్ లో నేను చేసిన రోల్స్ కి ఈ రోల్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. గతం లో నా క్యారెక్టర్ లో కనిపించే కామెడీ ఈ రోల్ లో అంతగా ఉండదు. జస్ట్ కొన్ని సీన్స్ లో లైట్ గా ఉంటుందంతే.
కొంచెం కష్టమే..
తారక్ తో డాన్స్ చేయడం కొంచెం కష్టమే కానీ ఇంతకు ముందు సాయి ధరమ్ తేజ్, రామ్ వంటి డాన్సింగ్ స్టార్స్ తో వర్క్ చేశాను కాబట్టి పెద్దగా కష్టం అనిపించలేదు. కానీ తారక్ స్పీడ్ తో మ్యాచ్ చేయడానికి కొంచెం కష్టపడ్డాను.
తమిళ్ రెండు మలయాళం ఒకటి
ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్ లో ‘సైతం కా బచ్చా’, ఇమైక్కా నొడిగళ్’ అనే సినిమాలతో పాటు మలయాళం లో ‘విలన్’ అనే సినిమాలో నటిస్తున్నాను. ఈ సినిమాలు తమిళ్, మలయాళం లో నాకు మంచి గుర్తింపు తీసుకొస్తాయని ఆశిస్తున్నాను.
డైరెక్టర్ కోసం మాత్రమే..
రవితేజ గారు నటిస్తున్న ‘రాజా ది గ్రేట్’ సినిమాలో ఓ కామియో రోల్ చేశాను. ఓ సాంగ్ లో స్పెషల్ అపిరియన్స్ కూడా చేశాను. ఆ సినిమాలో చేయడానికి ఒకే ఒక్క రీజన్ మై లవ్లీ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఆయన కోసమే కామియో చేశాను.
‘తొలి ప్రేమ’ ప్యూర్ లవ్ స్టోరీ
ప్రస్తుతం వరుణ్ తేజ్ తో నటిస్తున్న ‘తొలి ప్రేమ’ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. అది కంప్లీట్ ప్యూర్ లవ్ స్టోరీతో తెరకెక్కుతున్న సినిమా. పర్టిక్లర్ గా నాకు లవ్ స్టోరీ అంటే చాలా ఇష్టం. ఈ లవ్ స్టోరీ మూవీ లో పార్ట్ అవ్వడం సంతోషంగా ఉంది. షూర్ గా చెప్తున్నా ఆ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ చూసి అందరు ఇంప్రెస్ అవుతారు.
అదే నా ఫేవరేట్ సాంగ్
ఈ సినిమా సాంగ్స్ లో రావణ సాంగ్ బాగా నచ్చింది. ఈ సినిమాలో అదే నా ఫేవరేట్ సాంగ్ . సింగింగ్ పరంగా లిరిక్స్ పరంగా ది బెస్ట్ సాంగ్ అది. డైలీ వింటున్నా .. సినిమాకు డి.ఎస్.పి ది బెస్ట్ మ్యూజిక్ అందించారు. రియల్లీ ఐ లవ్ థిస్ సాంగ్.
దేవి అనుకున్నారు బట్ కుదరలేదు
ఈ సినిమాలో ట్రింగ్ ట్రింగ్ అనే సాంగ్ ను నాతో మరియు తారక్ తో పండించాలని దేవి ప్లాన్ చేశారు. కానీ తారక్ బిజీ గా ఉండటం నాకు కుదరకపోవడంతో పాడలేకపోయాం. మలయాళం నటిస్తున్న విలన్ సినిమాకు టైటిల్ సాంగ్ పాడాను. అలాగే నెక్స్ట్ తెలుగు లో నటిస్తున్న ‘తొలి ప్రేమ’ సినిమాలో కూడా ఒక పాట పాడుతున్నాను.
త్వరలోనే అనౌన్స్ చేస్తా..
ప్రస్తుతం వరుణ్ తేజ్ తో నటిస్తున్న సినిమా.. తమిళ్, మలయాళంలో మూడు సినిమాలు చేస్తున్నాను. ప్రస్తుతం ఇంకొన్ని డిస్కర్షన్స్ లో ఉన్నాయి. త్వరలోనే వాటి వివరాలు తెలియజేస్తాను.