మాస్ మహారాజ్ తో మరోసారి?

Thursday,July 02,2020 - 01:33 by Z_CLU

గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ‘క్రాక్’ సినిమా చేస్తున్న రవితేజ నెక్స్ట్ త్రినాధరావు నక్కిన తో సినిమా చేయబోతున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై విశ్వప్రసాద్ నిర్మించనున్న ఈ సినిమాకు హీరోయిన్ గా రాశి ఖన్నా ను ఫైనల్ చేశారనే టాక్ వినిపిస్తోంది.

రవితేజతో ఆమధ్య ‘టచ్ చేసి చూడు’ సినిమా చేసింది రాశి ఖన్నా… ‘రాజా ది గ్రేట్’ సినిమాలో కూడా ఓ స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ఇప్పుడు మరోసారి మహారాజ్ సరసన నటించబోతుంది.

మాస్ కమర్షియల్ సబ్జెక్ట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకు ప్రసన్న కుమార్ కథ -స్క్రీన్ ప్లే -మాటలు అందిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.