రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న చైతు

Monday,May 08,2017 - 01:30 by Z_CLU

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య ఎట్టకేలకి తన లేటెస్ట్ మూవీ ‘రారండోయ్ వేడుక చూద్దాం’ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాడు.. నాగ చైతన్య- రకుల్ జంటగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకొని ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.

ఇటీవలే ఈ సినిమాలోని టైటిల్ సాంగ్ ను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసిన మేకర్స్ సమ్మర్ స్పెషల్ గా మే 26 న ఈ సినిమా థియేటర్స్ కి రాబోతుందని ప్రకటించేశారు.. ప్రెజెంట్ దేవి శ్రీ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని 30 సెకన్ల టైటిల్‌ సాంగ్‌ టీజర్‌ సోషల్ మీడియా లో హంగామా చేస్తూ సినిమా పై అంచనాలను పెంచేస్తోంది.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాతో ఫామిలీ ఆడియన్స్ ఎట్రాక్ట్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్ గా ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు చైతు…