మెగా హీరోయిన్ కొత్త సినిమా లాంచ్.

Saturday,June 23,2018 - 12:08 by Z_CLU

ప్రస్తుతం సుమంత్ అశ్విన్ తో  ‘హ్యాపీ వెడ్డింగ్’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది నిహారిక కొణిదెల… ఈ సినిమా ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజికి చేరుకుంది. లేటెస్ట్ గా మరో సినిమాను కూడా స్టార్ట్ చేసింది మెగా హీరోయిన్…. నిర్వాన సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నం 1 గా తెరకెక్కనున్న ఈ సినిమాతో ‘ముద్దపప్పు’,’  నాన్న కూచి’, అనే వెబ్ సిరీస్ ను డైరెక్ట్  చేసిన ప్రనిత్ బ్రమండపల్లి  దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. విజయ్ మాస్టర్ తనయుడు రాహుల్ విజయ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఈరోజు పూజా  కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయింది.

ఈ లాంచ్ కి గెస్ట్ గా హాజరైన నాగ బాబు  క్లాప్ నివ్వగా వరుణ్ తేజ్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. జూన్ 25 నుండి  హైదరాబాద్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్  జరుపుకోనుంది. రెండు షెడ్యూల్స్  టోటల్ షూటింగ్ ను ఫినిష్ చేయాలనీ భావిస్తున్నారు మేకర్స్.