ఫిబ్రవరి 21న రాహు గ్రాండ్ రిలీజ్

Tuesday,January 14,2020 - 01:18 by Z_CLU

కృతి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్, చలాకీ చంటి, గిరిధర్, సత్యం రాజేష్, స్వప్నిక కీలక పాత్రలు పోషించిన సినిమా రాహు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

తన వాయిస్ తో తెలుగు ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తున్న సిధ్ శ్రీరామ్ పాడిన ‘‘ఎన్నెన్నో వర్ణాలు వాలాయి చుట్టూ నీతోటి నే సాగగా.. పాదాలూ దూరాలు మరిచాయి ఒట్టూ మేఘాల్లో ఉన్నట్టుగా.. ఏమో ఏమో ఏమో’’ పాట ‘రాహు’కు
ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సిధ్ శ్రీరామ్ గానం చేసిన ఈ పాట హాంటింగ్ సాంగ్ అనిపించుకుంటోంది.

ప్రేమకథా చిత్రంలా కనిపించినా.. ఇదో థ్రిల్లర్ మూవీ. టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో ఉండబోతుంది. ప్రేమకథలోని బలమైన ఎమోషన్స్ ని ప్రజెంట్ చేస్తూనే అనుక్షణం ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అయ్యే విధంగా కథనం సాగుతుంది.
ప్రవీణ్ లక్కరాజు అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రాహుకి అసెట్ గా మారింది.