నా సినిమాకు దర్శకుడు లేడు

Friday,February 23,2018 - 11:01 by Z_CLU

స్వయంగా శ్రీకాంత్ చెబుతున్న మాటిది. ఈరోజు రిలీజ్ అయిన రా..రా సినిమాకు దర్శకుడు లేడు. సినిమా టైటిల్స్ లో దర్శకుడు పేరు వేయలేదు. పేపర్ యాడ్స్ లో కూడా కో-డైరక్టర్ పేరు వేస్తున్నారు కానీ, డైరక్టర్ పేరు వేయడం లేదు. దీని వెనక అసలు కారణాన్ని స్వయంగా శ్రీకాంత్ వెల్లడించాడు.

“మా సినిమాకి దర్శకుడు లేడు. సినిమా మధ్యలో నిర్మాతకు, దర్శకుడికి పడలేదు. చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి. కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నించాను కానీ కుదర్లేదు. దాంతో దర్శకుడు తప్పుకున్నాడు. నేను ఎప్పుడూ ఇలాంటి విషయాల్లో నిర్మాతనే సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే కోట్లు పెట్టి సినిమాలు తీసే నిర్మాత కంటే నాకెవరూ ఎక్కువ కాదు. ఇక దర్శకుడి విషయానికొస్తే కథ అతడిది కాదు కాబట్టి వేరే దర్శకుడ్ని పెట్టి తీశాం. అతని పేరు మాత్రం చెప్పను.” అని అంటున్నాడు శ్రీకాంత్.

కెరీర్ లో ఫస్ట్ టైం హారర్ కామెడీ కాన్సెప్ట్ తో సినిమా చేశాడు శ్రీకాంత్. అంతేకాదు.. నటుడిగా తనకిది 125వ సినిమా అంటున్నాడు. ఈ సినిమాలో దెయ్యంతో ప్రేమలో పడతాడు శ్రీకాంత్.