రిలీజ్ కి రెడీ అవుతున్న శ్రీకాంత్ 'రా...రా..'

Tuesday,May 23,2017 - 11:55 by Z_CLU

శ్రీకాంత్ కరియర్ లోనే ఫస్ట్ టైమ్ హారర్ జోనర్ లో సినిమా చేయడం. రా..రా.. అనే ఇంటరెస్టింగ్ టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా, షూటింగ్ తో పాటు మ్యాగ్జిమం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కంప్లీట్ చేసేసుకుంది. జూన్ ఫస్ట్ వీక్ కల్లా సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది సినిమా యూనిట్.

హిల్లేరియస్ హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నాజియా హీరోయిన్ గా నటించింది. రావ్ రాక్ షకీల్  కంపోజ్ చేసిన మ్యూజిక్ డెఫ్ఫినేట్ గా రీచ్ అవుతుందని కాన్ఫిడెంట్ గా ఉన్న ఫిల్మ్ మేకర్స్, పెద్ద స్టార్ చేతుల మీదుగా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఆ స్టార్ ఎవరో ఇంకా రివీల్ అయితే చేయలేదు కానీ, మొత్తానికి ఈ వారంలోనే ఆడియో తో ఎట్రాక్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు ‘రా..రా’ యూనిట్.