కాజల్ తో క్విక్ చాట్

Tuesday,July 18,2017 - 04:38 by Z_CLU

రానా సరసన నేనే రాజు నేనే మంత్రి సినిమా పూర్తిచేసిన కాజల్  వెంటనే లండన్ చెక్కేసింది. ఫ్రీ టైం దొరికితే చాలు లండన్ వెళ్లిపోవడం కాజల్ కు ఇష్టం. అయితే ఈసారి ఆమె ప్రత్యేకంగా వింబుల్డన్ టెన్నిస్ మ్యాచ్ లు చూసేందుకు కూడా అక్కడకు వెళ్లింది.  లండన్ మీడియాతో కాజల్ స్మాల్ చిట్ చాట్.

ఆడాలనుకుంటాను. కానీ..

టెన్నిస్ లో క్రమశిక్షణ అంటే నాకు  చాలా ఇష్టం. చిన్నప్పుడు ఎక్కువగా ఆడేదాన్ని. టెన్నిస్ ప్రాక్టీస్ చేయాలని ఎప్పుడూ అనుకుంటాను. కానీ ప్రస్తుతం అది సాధ్యం కావడం లేదు. కానీ ఇప్పటికీ చూస్తుంటా.

ఫుల్ ఎంజాయ్ మెంట్ అంటే ఇక్కడే

లండన్ అంటే నాకు చాలా ఇష్టం. టైం దొరికితే ఇక్కడికి వచ్చి వాలిపోతుంటాను. ఇక్కడ నాకు చాలామంది ఫ్రెండ్స్, బంధువులు ఉన్నారు. ఇక్కడకు వచ్చిన ప్రతిసారి ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంటాను. లండన్ నాకు సెకెండ్ హోమ్ లాంటిది.

సానియా ది బెస్ట్

టెన్నిస్ లో నాకు నచ్చినవాళ్లు చాలామంది ఉన్నారు. కానీ సానియా అంటే ప్రత్యేకమైన అభిమానం. భూపతి, లియాండర్ పేస్, బోపన్న కూడా చాలా ఇష్టం.

ఇవి చూస్తా.. వాటిలో నటిస్తా..

స్పోర్ట్స్ సినిమాలు చూడడం అంటే ఇష్టం. కానీ రొమాంటిక్ కామెడీ సినిమాల్లో నటించడం ఇష్టం.