Ravanasura సాంగ్ కి సూపర్బ్ రెస్పాన్స్
Tuesday,February 21,2023 - 01:28 by Z_CLU
Raviteja’s #PyaarLonaPaagal is trending on everyone’s feed
రవితేజ, సుధీర్ వర్మ, ఆర్ టి టీమ్ వర్క్స్, అభిషేక్ పిక్చర్స్ ‘రావణాసుర’ (Ravanasura) నుంచి మాస్ మహారాజా రవితేజ పాడిన ప్యార్ లోన పాగల్ సెకండ్ సింగిల్ లిరికల్ వీడియో తాజాగా విడుదలయింది.
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja), క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మల కాంబినేషన్ లో హై-ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘రావణాసుర’ నుండి వాలెంటైన్ డే స్పెషల్ గా రిలీజైన ప్యార్ లోన పాగల్ లిరికల్ వీడియో ఆడియన్స్ నుండి సూపర్బ్ రెస్పాన్స్ అందుకుంటుంది. రవితేజ పాడిన ఈ సాంగ్ ఇప్పటికే 3 మిలియన్ వ్యూస్ కొల్లగొట్టింది.

హర్షవర్ధన్ రామేశ్వర్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ కి కాశర్ల శ్యామ్ లిరిక్స్ అందించాడు. రావణాసుర నుండి వచ్చిన ఈ బ్రేకప్ సాంగ్ చార్ట్ బస్టర్ లో మంచి స్థానం అందుకుంది. కాసర్ల శ్యామ్ అందించిన హార్ట్ బ్రేక్ లిరిక్స్ రవితేజ భావాలను చక్కగా ఆవిష్కరించింది.
రవితేజ, ఫరియా అబ్దుల్లా, శ్రీరామ్ మధ్య వచ్చే ఈ సాంగ్ లో రవితేజ డాన్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఆకట్టుకుంది.
సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ.. కథానాయికలుగా నటిస్తున్నారు. ఏప్రిల్ 7, 2023న రావణాసురు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
- Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics