PushpaRaj Intro - రికార్డ్ వ్యూస్!

Tuesday,April 27,2021 - 03:23 by Z_CLU

పుష్ప సినిమాకు సంబంధించి ఫ్యాన్స్ కి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ అందిస్తూ వస్తున్న మేకర్స్ తాజాగా అల్లు అర్జున్ పుట్టిన రోజు నాడు సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు. #PushpaRajIntro పేరుతో విడుదలైన ఈ టీజర్ అందరినీ ఎట్రాక్ట్ చేసి సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. పుష్ప రాజ్ ఎలా ఉంటాడో..? సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి? హీరోయిన్ లుక్ ఎలా ఉండనుంది ? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం అందిస్తూ పుష్ప రాజ్ ఇంట్రో వదిలారు. దీంతో సినిమాపై ఉన్న ప్రశ్నల్లో కొన్ని క్లియర్ అయ్యాయి. విడుదలైన నిమిషాలకే రీసెంట్ టైమ్స్ లో ది బెస్ట్ టీజర్ అంటూ సెలబ్రిటీస్ కూడా పోస్టులు పెట్టారు.

ఏప్రిల్ 7న యూ ట్యూబ్ ద్వారా రిలీజైన ఈ టీజర్ చాలా తక్కువ టైంలో 50 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డు నెలకొల్పింది. కేవలం 20 రోజుల్లో అరుదైన రికార్డు అందుకొని పుష్ప టీజర్ తో తన స్టామినా చూపించాడు బన్నీ. ప్రస్తుతం #Fastest50MForPushpaRajIntro ట్యాగ్ తో సోషల్ మీడియాలో పుష్ప టీజర్ ట్రెండ్ అవుతోంది. రిలీజ్ కి ముందే టీజర్ 50 మిలియన్ వ్యూస్ కొల్లగొట్టిన బన్నీ క్రేజ్ ని పొగుడుతూ అభిమానులు పోస్టులు చేసుకుంటున్నారు.

సినిమాలో పుష్ప రాజ్ అనే ఊర మాస్ క్యారెక్టర్ లో కనిపించనున్న బన్నీ పుష్ప తో ప్రేక్షకులకి కొత్తగా పరిచయమవుతాడని అంటున్నారు. ఈ విషయం టీజర్ లో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ , సీన్స్ చూస్తే అర్థమవుతోంది. ఇక రంగస్థలం రేంజ్ లో ఈ సినిమాలో ఇంపాక్ట్ క్రియేట్ చేసే క్యారెక్టర్స్ ఉంటాయని తెలుస్తుంది. ముఖ్యంగా సునీల్ , రావు రమేష్ , అనసూయ పాత్రలు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు.

ఇక బన్నీ -సుక్కు కాంబినేషన్ లో మూడో సినిమాగా వస్తున్న పుష్ప పై అటు బన్నీ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్ట్ లో థియేటర్స్ లోకి రానుంది. మైత్రి మూవీ మేకర్స్ బేనర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
    stories, Gossips, Actress Photos and Special topics