Pushpa 2: ఆరేళ్ళ తర్వాత పుష్ప రాజ్

Thursday,April 06,2023 - 02:07 by Z_CLU

‘పుష్ప 2’ నుండి అప్ డేట్ ఎప్పుడెప్పుడా ? అని ఎదురుచూసిన బన్నీ ఫ్యాన్స్ కి ఎట్టకేలకు ‘వేర్ ఈజ్ పుష్ప’ అనే ఎనౌన్స్ మెంట్ గ్లిమ్స్ తో ఓ అప్ డేట్ అందింది. ఏప్రిల్ 7న ‘పుష్ప ది రూల్’ టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని చెప్తూ విడుదల చేసిన గ్లిమ్స్ లో ఇంట్రెస్టింగ్ మేటర్ రివీల్ చేశాడు సుకుమార్.

పుష్ప ది రైజ్ సినిమాను 1998 బ్యాక్ డ్రాప్ లో చూపించిన సుకుమార్ ఇప్పుడు ‘పుష్ప 2’ ని 2004 బ్యాక్ డ్రాప్ లో చూపించబోతున్నాడు. దీనికి తగ్గట్టే పార్ట్ 1 ‘చూడాలని వుంది’ సినిమా చూపిస్తే ఇప్పుడు ఎనౌన్స్ మెంట్ గ్లిమ్స్ లో ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ పోస్టర్ కనిపించింది. అలాగే ఏడాది కూడా వీడియోలో చెప్పారు.

దీన్ని బట్టి చూస్తే 1998 లో పుష్ప ఓ కేసులో జైలుకి వెళ్ళి మళ్ళీ 2004 లో బయటికొస్తాడు. అంటే ఆరేళ్ళ తర్వాత పార్ట్ 2 కథ మొదలవుతుంది అన్నమాట.

మరి ఈ ఆరేళ్లల్లో పుష్ప రాజ్ సిండికేట్ వ్యవస్థను ఎలా రూల్ చేశాడు ? డాన్ గా ఎలా ఎదిగాడు ? అనేది కథ మధ్యలో ఏమైనా చూపించే అవకాశం ఉంది. ఏదేమైనా ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత సుకుమార్ పుష్ప 2 కంటెంట్ ప్లాన్ చేస్తున్నారంటే ఏదో మేటర్ ఉంటుందని అర్థమవుతుంది.

మరి పుష్ప రాజ్ ఎందుకు జైలుకి వెళ్ళాడు? ఎలా తప్పించుకున్నాడు? తిరుపతి జైలు నుండి తప్పించుకొని ఏం చేశాడు? అనేది ఆసక్తి రేకెత్తిస్తుంది. వీటిలో కొన్నిటికి బన్నీ బర్త్ డే రోజు రిలీజయ్యే టీజర్ లో సుకుమార్ ఆన్సర్ ఇచ్చే అవకాశం ఉంది.