Pushpa - రిసార్ట్స్ బుక్ చేసిన యూనిట్

Monday,October 12,2020 - 05:16 by Z_CLU

ఎట్టకేలకు పుష్ప మూవీకి సంబంధించి షెడ్యూల్ లాక్ అయింది. లాక్ డౌన్ కు ముందు షెడ్యూల్ చేసిన విధంగానే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మారేడుమిల్లి అటవీప్రాంతంలోనే Pushpa Movie కొత్త షెడ్యూల్ మొదలవుతుంది.

ఈ మేరకు ఆ ప్రాంతానికి దగ్గర్లో ఉన్న రిసార్ట్స్ అన్నీ బుక్ చేసింది పుష్ప యూనిట్. అందరికీ ఈ రిసార్ట్స్ లోనే వసతి. షూటింగ్ పూర్తయ్యేంతవరకు ఈ రిసార్ట్స్, షూటింగ్ లొకేషన్ దాటి ఎవ్వరూ బయటకు వెళ్లకూడదు. ఇతరులు లోపలకు రాకూడదు.

Also Read – పుష్ప సాంగ్స్ రెడీ

అలా పూర్తిగా కరోనా గైడ్ లైన్స్ ప్రకారం పుష్ప షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. ప్రస్తుతం RRR, లవ్ స్టోరీ సినిమాలకు ఇదే పద్ధతి ఫాలో అవుతున్నారు. ఇప్పుడు పుష్ప కోసం కూడా ఇదే సెల్ఫ్-ఐసొలేషన్ ఫార్ములాను ఫాలో అవ్వబోతున్నారు.

అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే నెల నుంచి పుష్ప రెగ్యూలర్ షూట్ స్టార్ట్ అవుతుంది. మూవీలో Allu Arjun లారీ డ్రైవర్ గా కనిపించబోతున్నాడు. సుకుమార్ దర్శకుడు.