Pushpa టీజర్ వచ్చేస్తుంది !

Tuesday,March 02,2021 - 03:52 by Z_CLU

‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ లుక్ ఎలా ఉండబోతుందో పోస్టర్స్ ద్వారా ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసిన సుకుమార్ త్వరలోనే పుష్ప రాజ్ క్యారెక్టర్ తో ఓ టీజర్ వదలనున్నాడు. ఏప్రిల్ 8న బన్నీ పుట్టిన రోజుని పురస్కరించుకొని ‘పుష్ప’ టీజర్ రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు మేకర్స్. ఇప్పటికే సుక్కు టీజర్ కి సంబంధించి కొన్ని షాట్స్ తో పాటు సన్నివేశాలు కూడా సెలెక్ట్ చేసి ఎడిటింగ్ టేబుల్ మీద పెట్టేశాడని తెలుస్తుంది.

టీజర్ లో యాక్షన్ షాట్స్ తో పాటు బన్నీ క్యారెక్టర్ ఎలివేట్ అయ్యేలా ఓ పవర్ ఫుల్ డైలాగ్ కూడా ఉంటుందని సమాచారం.  యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో బన్నీ లుక్, పవర్ ఫుల్ క్యారెక్టర్ మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఎట్రాక్ట్ చేస్తాయని ఇన్సైడ్ టాక్. మరి స్టైలిష్ స్టార్ బర్త్ డే కి రిలీజ్ అవ్వనున్న పుష్ప టీజర్ సినిమాపై ఎలాంటి అంచనాలు నెలకొల్పుతుందో ? వేచి చూడాలి.

Also Read మహేష్ , బన్నీ ప్లానింగ్ సూపర్