Pushpa రెండో షెడ్యుల్ డీటెయిల్స్

Wednesday,December 09,2020 - 01:00 by Z_CLU

Allu Arjun హీరోగా క్రియేటీవ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న Pushpa సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆగిన సంగతి తెలిసిందే. ఇటివలే మారేడుమిల్లి , రంప చోడవరం పరిసర ప్రాంతాల్లో ఒక షెడ్యుల్ చేసారు. అనుకున్న షెడ్యుల్ లో  నాలుగైదు రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉండగా షూటింగ్ లో టీంకి కరోనా పాజిటీవ్ వచ్చింది. దీంతో ఉన్నపళంగా షూటింగ్ నిలిపివేసి యూనిట్ హైదరాబాద్ వచ్చేసారు.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ‘పుష్ప’ నెక్స్ట్ షెడ్యుల్ హైదరాబాద్ లోనే ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికే ఆ షెడ్యుల్ కి సంబంధించి ప్లాన్ రెడీ అవుతుందని ఇదే నెలలో మళ్ళీ షూటింగ్ మొదలు కానుందని అంటున్నారు. ఈ షూట్ కోసం  హైదరాబాద్ లో  ఓ స్టూడియోలో భారీ సెట్స్ రెడీ అవుతున్నాయట.

ఏదేమైనా అనుకున్న ప్లానింగ్ ప్రకారం షూటింగ్ చేసి వచ్చే ఏడాది సినిమాను థియేటర్స్ లోకి తీసుకురావాలని చూస్తున్నారు సుక్కు అండ్ టీం. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.