Pushpa - మరికొన్ని రోజులు పోస్ట్ పోన్

Thursday,November 05,2020 - 05:26 by Z_CLU

లెక్కప్రకారం ఇవాళ్టి నుంచి Allu Arjun PUSHPA మూవీ సెట్స్ పైకి రావాలి. కానీ ఇప్పుడీ సినిమా ఇంకాస్త ఆలస్యంగా సెట్స్ పైకి రాబోతోంది.

ఈనెల 8 లేదా 9 నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వచ్చేలా ఉంది. ఈ చిన్న వాయిదాకు చిన్న రీజన్ ఉంది.

రంపచోడవరం, మారేడుమిల్లి ప్రాంతాల్లో పుష్ప షూట్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ఏర్పాట్లు, సెట్ వర్క్ ఇంకా పూర్తికాలేదు. మరో 4-5 రోజులు పట్టేలా ఉంది. అందుకే ఈ వాయిదా. షూట్ కోసం ఇప్పటికే రాజమండ్రిలోని కొన్ని రిసార్టులు, హోటల్స్ బల్క్ లో బుక్ చేశారు.

మరోవైపు Director Sukumar పక్కా ప్లాన్ తో రెడీ అయ్యాడు. ఒక్క సినిమా సినిమా సెట్స్ పైకి వస్తే ఏకథాటిగా నెల రోజుల పాటు షెడ్యూల్ ప్లాన్ చేశాడు. సో.. ఇకపై పుష్ప పరుగులు పెడుతుందన్నమాట.

రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.