క్రేజీ సినిమాలు.. ట్రయిలర్ రిలీజ్ డేట్స్

Sunday,December 05,2021 - 03:43 by Z_CLU

Pushpa Radheshyam Bheemla Nayak Trailer Release Dates

అఖండ నుంచి టాలీవుడ్ లో పెద్ద సినిమాల సందడి మొదలైంది. క్రేజీ మూవీస్ అన్నీ వరుసగా థియేటర్లలోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా పెద్ద సినిమాల ట్రయిలర్ రిలీజ్ డేట్స్ కూడా దాదాపు ఫిక్స్ అయ్యాయి. ఏ సినిమా ట్రయిలర్ ఎప్పుడొస్తుందో చూద్దాం.

pushpa

బన్నీ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి చాలా బజ్ నడుస్తోంది. దీన్ని నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లేందుకు యూనిట్ ట్రయిలర్ రిలీజ్ ప్లాన్ చేస్తోంది. దీనికి సంబంధించి రీసెంట్ గా రిలీజ్ చేసిన గ్లింప్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. రేపు పుష్ప ట్రయిలర్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.

RRR trailer

ఇక ఆర్ఆర్ఆర్ ట్రయిలర్ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా ట్రయిలర్ ను 9వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ నేరకు ఆర్ఆర్ఆర్ యూనిట్ ను అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చేసింది. నిజానికి ఈ సినిమా ట్రయిలర్ ను ఇంకాస్త ముందే రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ సిరివెన్నెల అకాల మృతితో ట్రయిలర్ లాంచ్ పోస్ట్ పోన్ చేశారు. అలా వాయిదా పడిన ట్రయిలర్, 9న రాబోతోంది.

prabhas radheshyam

సంక్రాంతి బరిలో నిలిచిన రాధేశ్యామ్ ట్రయిలర్ కూడా రెడీ అయింది. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా అంచనాలున్నాయి. మూవీ ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తోందా అని అంతా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్, పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా పాటలకు ఇప్పటికే గ్రేట్ రెస్పాన్స్ వచ్చింది. ఇదే ఊపులో ఈనెల 17న ట్రయిలర్ ను లాంఛ్ చేయాలనుకుంటున్నారట. సినిమాకు సంబంధించి టీజర్ ఉంటుందా ఉండదా అనేది ప్రస్తుతానికి క్లారిటీ లేదు,

pawan kalyan bheemla nayak

పవన్ కల్యాణ్, రానా హీరోలుగా నటిస్తున్న భీమ్లానాయక్ సినిమా ట్రయిలర్ కూడా రెడీ అవుతోంది. మూవీలో పవన్, రానా లుక్స్ ఎలా ఉంటాయనే విషయంపై ఇప్పటికే ఆడియన్స్ కు ఓ క్లారిటీ వచ్చేసింది. మరోవైపు 4 పాటలు కూడా రిలీజ్ అయిపోయాయి. సో.. ట్రయిలర్ లాంఛ్ తో ప్రమోషన్ ను పీక్స్ కు తీసుకెళ్లాలనుకుంటున్నారు సితార ఎఁటర్ టైన్ మెంట్స్ నిర్మాతలు. అన్నీ అనుకున్నట్టు జరిగితే జనవరి 1 లేదా 5వ తేదీన భీమ్లానాయక్ ట్రయిలర్ రాబోతోంది.