"పుష్ప" ఛేజింగ్ సీన్స్ అన్నీ అక్కడే

Monday,July 06,2020 - 03:51 by Z_CLU

బన్నీ హీరోగా రాబోతున్న పుష్ప సినిమాకు సంబంధించి ప్లాన్స్ శరవేగంగా మారిపోతున్నాయి. లాక్ డౌన్ కారణంగా నిరవథికంగా వాయిదాపడిన ఈ సినిమా షూటింగ్ ను లెక్కప్రకారం తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లిలో స్టార్ట్ చేయాలి. కానీ ఇప్పుడు ప్లాన్ మారినట్టు తెలుస్తోంది.

హైదరాబాద్ కు దగ్గర్లోనే ఉన్న మహబూబ్ నగర్ జిల్లా అటవీ ప్రాంతంలో పుష్ప షూట్ చేయాలని నిర్ణయించారు. ఈ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సినిమాకు సంబంధించి ఛేజ్ సీన్స్ తీయాలని అనుకుంటున్నారట.

అయితే దీనికి ఇంకా టైమ్ ఉంది. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ మాత్రం రామోజీ ఫిలింసిటీలోనే స్టార్ట్ అవుతుంది. ప్రభుత్వం విధించిన గైడ్ లైన్స్ ప్రకారం, ఫిలింసిటీలో వేసిన సెట్ లో తక్కువ మందితో షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు.

సుకుమార్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది.