Pushpa ఇంపాక్ట్ క్రియేట్ చేయనున్న క్యారెక్టర్స్

Thursday,April 22,2021 - 03:42 by Z_CLU

సుకుమార్ తీసిన ‘రంగస్థలం’ ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అయితే సినిమాకు డ్రామా, సస్పెన్స్, ట్విస్ట్ కంటెంట్ పరంగా ఎంత బలం చేకూర్చాయో… క్యారెక్టర్స్ కూడా అంతే బలాన్నిచ్చాయి. ఆ క్యారెక్టర్స్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశాయి. అందుకే ‘రంగస్థలం’ అనగానే చిట్టిబాబు తర్వాత మనకి కుమార్ బాబు, రంగమ్మత్త, మహేష్ ఇలా కొన్ని పాత్రలు గుర్తొస్తాయి. ఇప్పుడు ‘పుష్ప’లో కూడా అలాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉంటాయని తెలుస్తుంది. ‘పుష్ప’ కోసం ఇప్పటికే చాలామంది నటీనటులను తీసుకున్నాడు సుకుమార్. అందులో రావు రమేష్, సునీల్, అనసూయ, అజయ్ ఘోష్ ఉన్నారు. కథలో కీలకమైన పాత్రల ద్వారా ఈసారి కూడా ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడట సుక్కు.

ముఖ్యంగా సునీల్, రావు రమేష్, అనసూయ పాత్రలు సినిమాకి హైలైట్ గా నిలుస్తాయట. అలాగే వీరితో పాటు ఇంకో ఇద్దరు యంగ్ యాక్టర్స్ క్యారెక్టర్స్ కూడా సినిమాలో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయని అంటున్నారు. ఇప్పటికే సునీల్, రావు రమేష్ షూటింగ్ లో పాల్గొంటూ కీలక సన్నివేశాల్లో నటిస్తుండగా నిన్నటి నుండి అనసూయ జాయిన్ అయ్యింది.

ప్రస్తుతం అల్లు అర్జున్, అనసూయ మిగతా నటీనటులపై కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. రంగస్థలం తర్వాత రంగమ్మత్త గా మంచి క్రేజ్ అందుకున్న అనసూయ పుష్ప తర్వాత మళ్ళీ అలాంటి క్రేజ్ సొంతం చేసుకోవడం నటిగా అభినందనలు అందుకోవడం ఖాయం అంటున్నారు.

ఈ పాత్రలతో పాటు ఫహాద్ ఫాసిల్ విలనిజం కూడా సినిమాకు మెయిన్ హైలైట్ అవ్వనుందని ఇన్సైడ్ టాక్. విలన్ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని అందుకే బాగా జల్లెడ పట్టి మలయాళం నుండి ఫహాద్ ఫాసిల్ ని తీసుకున్నారు.

ఇక బన్నీ కెరీర్ లో పుష్ప ది బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పుకునేలా ఉంటుందని టీజర్ చూస్తేనే తెలిసిపోయింది. మైత్రి మూవీ మేకర్స్ బేనర్ పై పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
    stories, Gossips, Actress Photos and Special topics