ఆ రెండింటితో ఫుల్ బిజీ

Tuesday,March 07,2017 - 09:04 by Z_CLU

స్టార్ డైరెక్టర్స్ లో కొందరు ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో, మరికొందరు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో బిజీ గా గడుపుతుంటే పూరి జగన్నాథ్ మాత్రం ఒకే సారి ఈ రెండింటితో ఫుల్ బిజీ అయిపోయాడు.. ఓ వైపు బాలకృష్ణతో తను తెరకెక్కించే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ చూసుకుంటూనే మరోవైపు తను దర్శకత్వం వహించిన ‘రోగ్’ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి ఫినిషింగ్ ఇచ్చే పనిలో పడ్డాడు…

నిజానికీ ఈ రెండు సినిమాలు పూరి కి చాలా ఇంపార్టెంట్.. ‘రోగ్’ సినిమాతో ఇషాన్ కి బంపర్ హిట్ ఇస్తానని మేకర్స్ కి  ప్రామిస్ చేశాడు పూరి.. దీంతో పాటు మిగతా దర్శకులను సైతం పక్కన పెట్టి మరీ బాలయ్య ఛాన్స్ ఇవ్వడం తో ఈ సినిమాను కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాడు పూరి.. ఇక ఇప్పటికే పూరి కెరీర్ లో చాలా లేట్ సినిమాగా పేరుతెచ్చుకున్న ‘రోగ్’ ను సమ్మర్ కి ఎలాగైనా రిలీజ్ చేయాలనీ చూస్తూనే మరో వైపు బాలయ్య తో తెరకెక్కించే ప్రతిష్టాత్మక సినిమాకు ఆర్టిస్టులను సెలెక్ట్ చేస్తూ  త్వరలోనే సెట్స్ పై పెట్టడానికి రెడీ అవుతున్నాడు… ఇలా పూరి ఈ రెండిటినీ తన స్టైల్ లో స్పీడ్ గా ఫినిష్ చేస్తూ జెట్ స్పీడ్ తో వర్క్ చేస్తున్నాడన్నమాట ..