పూరి స్పీడుకి బ్రేక్ వేసిన కరోనా

Monday,July 06,2020 - 01:34 by Z_CLU

టాలీవుడ్ లో జెట్ స్పీడులో సినిమా చేసే స్టార్ దర్శకుల్లో పూరి జగన్నాథ్ ముందుంటాడనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజమౌళి కూడా ఈ విషయంలో పూరి దగ్గర ట్రైనింగ్ తీసుకుంటానని ఓ సందర్భంలో సరదాగా చెప్పుకున్నారు. అలాంటి పూరి స్పీడుకి బ్రేక్ పడింది.

అవును.. అన్ని అనుకున్నట్లు జరిగితే విజయ్ దేవరకొండ తో చేస్తున్న సినిమా షూటింగ్ ఈ పాటికి ఓ కొలిక్కి వచ్చేది. దసరా కి థియేటర్స్ లో ఉండేది. కానీ కరోనా ఎఫెక్ట్ తో లాక్ డౌన్ వల్ల సినిమా షూట్ వాయిదా పడింది.

ప్రస్తుతం ప్రభుత్వం షూటింగ్స్ కి పర్మిషన్ ఇచ్చిన ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టలేని పరిస్థితి. దీంతో పరిస్థితులు చక్కబడే వరకు ఎదురుచూస్తున్నాడు పూరి. అన్ని సెట్ అవ్వగానే ఈ సినిమాను మళ్ళీ సెట్స్ పైకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడు జగన్. కరోనా వల్ల పూరి కెరీర్ లో ఎక్కువ టైమ్ వర్క్ చేసిన సినిమాగా ఇది నిలిచిపోతుంది.