'సర్కారు వారి పాట'.. పూరి ఏమన్నాడంటే!

Sunday,May 31,2020 - 03:54 by Z_CLU

ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భాన్ని పురస్కరించుకొని మహేష్ కొత్త సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘సర్కారు వారి పాట’ టైటిల్ తో మహేష్ సైడ్ లుక్ తో ఓ పోస్టర్ కూడా వదిలారు మేకర్స్. ఈ టైటిల్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే తాజాగా పూరి కూడా టైటిల్ తనకు బాగా నచ్చిందని ట్వీట్ చేశాడు.

ఇక దర్శకుడు పరశురాం ప్రయాణాన్ని చిన్నతనం నుండి చూస్తున్నానని తనకి ‘సర్కారు వారి పాట’ మైలురాయిలాంటి సినిమా అవుతుందంటున్నాడు పూరి.

సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని ముఖ్యంగా మహేష్ అభిమానులు ఈ సినిమా సక్సెస్ ను బాగా సెలెబ్రేట్ చేసుకుంటారని అన్నాడు.

పూరి ట్వీట్ తో మహేష్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇక మరో ట్వీట్ లో తను తీసిన సూపర్ స్టార్ కృష్ణ గారి స్టిల్ ను షేర్ చేస్తూ ఆ జ్ఞాపకాన్ని గుర్తుచేసుకుంటూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు పూరి.