తనయుడితో రెడీ అవుతున్న పూరి జగన్నాథ్

Sunday,September 17,2017 - 11:14 by Z_CLU

ఇటీవలే బాలయ్యతో ‘పైసా వసూల్’ సినిమా తీసిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ నెక్ట్స్ తన తనయుడిని గ్రాండ్ గా లాంఛ్ చేసే పనిలో బిజీ అయిపోయాడు. ఆకాష్ కోసం ఇప్పటికే  ఓ డిఫరెంట్ లవ్ స్టోరీ  ఫైనల్ చేసిన పూరి ఈ సినిమాలో ఆకాష్ తో పాటు కొంత మంది కొత్తవారిని కూడా తీసుకోనున్నాడట. ఇప్పటికే ఈ సినిమాలో నటించే వారి కోసం పూరి కనెక్ట్స్ ద్వారా ఆడిషన్స్ కూడా స్టార్ట్ చేసేశాడు పూరి.

ఈ సినిమాను పూరి తనే నిర్మాణంలోనే తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ ఫైనల్ స్టేజి కి చేరుకున్న ఈ సినిమాను వచ్చే నెల స్టార్ట్ చేసి నవంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లాలని చూస్తున్నాడట పూరి. త్వరలోనే ఈ సినిమాకు పనిచేయబోయే టెక్నీషియన్స్ వివరాలు తెలియజేయనున్నారు.