సెప్టెంబర్ నుంచి ఆ హీరోతో సెట్స్ పైకి ...

Saturday,April 29,2017 - 10:00 by Z_CLU

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రెజెంట్ నందమూరి బాలకృష్ణ హీరోగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. గ్యాంగ్ స్టర్స్ నేపధ్యంలో జరిగే కథ తో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రెజెంట్ హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.. అయితే ఈ సినిమా తర్వాత పూరి ఏ హీరోతో సినిమా చేస్తాడా..అనే క్యూరియాసిటీ ప్రెజెంట్ అందరిలోనూ నెలకొంటుంది.. దీని రీజన్ పూరి ఇప్పటికే మెగా స్టార్ చిరంజీవి, మహేష్, వెంకటేష్ లకు కథ చెప్పడమే..

అందరు అనుకున్నట్లు పూరి మాత్రం నెక్స్ట్ సినిమాను స్టార్ హీరో తో కాకుండా ఓ యంగ్ హీరోతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట. ఆ యంగ్ హీరో మరెవరో కాదు ఇటీవలే పూరి దర్శకత్వంలో తెరకెక్కిన రోగ్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన ఇషాన్ అట.. రోగ్ టైం లోనే నెక్స్ట్ ఇషాన్ తో ఓ సినిమా చేస్తానని కమిట్ అయిన పూరి ప్రెజెంట్ ఇషాన్ కోసం మరో లవ్ స్టోరీ రెడీ చేసి ఆ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలెట్టేశాడట.. సెప్టెంబర్ వరకూ బాలయ్య సినిమాతో బిజీ ఉండే పూరి ఇషాన్ తో రూపొందించే సినిమాను సెప్టెంబర్ లోనే స్టార్ట్ చేసి సెట్స్ పై పెట్టబోతున్నాడని సమాచారం..