సెన్సార్ క్లియర్ చేసుకున్న పూరి ‘మెహబూబా’

Friday,May 04,2018 - 12:57 by Z_CLU

మే 11 న రిలీజ్ కి రెడీ వుతుంది పూరి జగన్నాథ్ మెహబూబా. పూరి ఆకాష్, నేహాశెట్టి జంటగా నటించిన ఈ సినిమా U/A సర్టిఫికెట్ తో సెన్సార్ క్లియరెన్స్ పొందింది. అల్టిమేట్ లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాతో పూరి ఆకాష్ ని ఫుల్ ఫ్లెజ్డ్ కమర్షియల్ హీరోగా ప్రెజెంట్ చేస్తున్నాడు పూరి జగన్నాథ్.

ఇప్పటికే రిలీజైన సినిమా ట్రైలర్ తో పాటు సాంగ్స్ సినిమాపై భారీ ఇంపాక్ట్ నే క్రియేట్ చేస్తున్నాయి. ఇండియా – పాక్ వార్ బ్యాక్ డ్రాప్ లో హై ఇమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ లా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే క్రియేట్ అవుతున్నాయి. ఈ సినిమా రన్ టైమ్ 2 :30 నిమషాలు.

 

సందీప్ చౌతా మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాని పూరి జగన్నాథ్ పూరి టూరింగ్ టాకీస్ బ్యానర్ పై నిర్మించాడు. ఈ సినిమాని దిల్ రాజు ప్రెజెంట్ చేస్తున్నాడు.