1700కి పైగా స్క్రీన్స్‌లో 'మెహబూబా' ట్రైలర్‌

Thursday,April 12,2018 - 11:45 by Z_CLU

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఆకాష్‌ పూరి హీరోగా లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘మెహబూబా’. ఈ చిత్రానికి సందీప్‌ చౌతా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రంతో పాటు ప్రదర్శించనున్నారు. 1700కి పైగా స్క్రీన్స్‌లో ‘మెహబూబా’ ట్రైలర్‌ను ప్రదర్శించనున్నారు.

ఇప్పటికే సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌కి, టీజర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఈ చిత్రాన్ని దిల్‌రాజు వెంకటేశ్వర ఫిలింస్‌ ద్వారా విడుదల చేస్తున్నారు. మే 11న సమ్మర్‌ స్పెషల్‌గా ‘మెహబూబా’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 1971 ఇండియా-పాకిస్తాన్‌ యుద్ధ నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

పూరి ఆకాశ్‌ సరసన నేహాశెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి..
సంగీతం: సందీప్‌ చౌతా
సినిమాటోగ్రఫీ: విష్ణుశర్మ
ఎడిటింగ్‌: జునైద్‌ సిద్ధిఖీ
యాక్షన్‌: రియల్‌ సతీష్‌
ఆర్ట్‌: జానీ షేక్‌
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, నిర్మాత, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.